
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 98


గురువుగారితో నా కథ డిస్కషన్..!
హాలీవుడ్ లో "జేమ్స్ బాండ్" గా రామ్ చరణ్ ?

'ప్రాజెక్ట్K' రిలీజ్ డేట్ అప్ డేట్..!

రష్మిక ఫస్ట్ టైమ్ ర్యాంప్ వాక్

“#AK 61 ” తమిళ మూవీలో కీలక పాత్రలో అజయ్

హరీష్ శంకర్ డైరెక్షన్ లో బన్నీ...!

రామారావు ఆన్ డ్యూటీ సెన్సార్ కంప్లీట్..!

ప్రభాస్ పై కళ్యాణ్ రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సీతారామం'

అందుకే 'ఎన్టీఆర్ 30' ఆలస్యం..!

"చంద్రముఖి 2 " మూవీ లో ఐదుగురు హీరోయిన్లు

మరో తెలుగమ్మాయి చాందిని చౌదరి కోలీవుడ్ ఎంట్రీ

సినిమాల నుండి బ్రేక్ తీసుకున్న నిత్యా మీనన్

సెన్సార్ పూర్తిచేసుకున్న 'బింబిసార'
వశిష్ఠ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ బింబిసార. టైమ్ ట్రావెల్, పీరియాడిక్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాకు మొదటి నుండి మంచి బజ్ ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌తో పాటు లిరికల్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త ట్రైలర్‌ను ఎన్టీఆర్ విడుదల చేశారు. అది కూడా ఆకట్టుకుంటుంది. అంతేకాదు సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని వ్యూస్ తో దూసుకుపోతుంది.

గురువుగారితో నా కథ డిస్కషన్..!
సుకుమార్ దగ్గర శిష్యరికం చేసి మొదటి సినిమా ఉప్పెన తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు బుచ్చిబాబు. ఇక ఈసినిమా తరువాత ఈసినిమాలో హీరో హీరోయిన్స్ గా చేసిన కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్ ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు మాత్రం ఇప్పటివరకూ మరో సినిమాను లైన్ లో పెట్టలేదు. ఉప్పెన తర్వాత బుచ్చి బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తన తర్వాత సినిమా ఉంటుందని, దర్శకుడు చెప్పిన కథ తారక్ కు బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని కూడా అన్నారు. కానీ అది కూడా కుదరలేదు. ఆతరువాత బుచ్చి బాబు తన మొదటి హీరో వైష్ణవ్ తో కలిసి మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు అన్నారు. అది వార్తల వరకే పరిమితమైంది.
హాలీవుడ్ లో "జేమ్స్ బాండ్" గా రామ్ చరణ్ ?
సూపర్ హిట్ "చిరుత" మూవీ తో టాలీవుడ్ హీరోగా పరిచయం అయిన రామ్ చరణ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ , ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న "#RC15 " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ "ఆర్ ఆర్ ఆర్ " మూవీని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమురం భీమ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి…

'ప్రాజెక్ట్K' రిలీజ్ డేట్ అప్ డేట్..!
ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. వాటిలో ఇప్పటికే ఓం దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇంకా సలార్ సినిమా షూటింగ్ దశలోనే ఉంది. వీటితో పాటు నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమాను కూడా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. అయితే ఈసినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందించనున్నట్టు సినిమాను ప్రకటించినప్పుడే తెలిపారు. ఇక ఇప్పుడు అదే చెబుతున్నాడు నిర్మాత అశ్వినీదత్.
'విక్రాంత్ రోణ' తెలుగు మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే హారర్ జోనర్ సినిమాలు నచ్చేవాళ్లకు ఈసినిమా బాగా నచ్చుతుంది. అలాగే విజువల్స్ పరంగా కూడా ఈసినిమా బాగుంది కాబట్టి విజువల్స్ కోసం చూసేవాళ్లు చూడొచ్చు.

ధనుష్ "నానే వరువేన్ "మూవీ న్యూ పోస్టర్ రిలీజ్
తమిళ స్టార్ హీరో ధనుష్ తన సోదరుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో "కాదల్ కొండెన్ ", "పుదు పేట్టై" , "మయక్కం ఎన్న " మూవీస్ లో నటించిన విషయం తెలిసిందే. దాదాపు 10 సంవత్సరాల తరువాత సెల్వ రాఘవన్ , ధనుష్ కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కింది. వి క్రియేషన్స్ బ్యానర్ పై సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన "నానే వరువేన్ "తమిళ మూవీ సెప్టెంబర్ నెలలో రిలీజ్ కానుంది. ధనుష్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో ఇందుజ రవిచంద్రన్ , ఎల్లి అవరం కథానాయికలు. సెల్వ రాఘవన్ , ప్రభు , యోగి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

రష్మిక ఫస్ట్ టైమ్ ర్యాంప్ వాక్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ “సీతారామం”మూవీ లో కీలక పాత్రలో నటించిన రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#THALAPATHY 66 “మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ”విడుదలకు సిద్ధంగా ఉంది. బిగ్ బీ…

“#AK 61 ” తమిళ మూవీలో కీలక పాత్రలో అజయ్
జీ స్టూడియోస్ , బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పి బ్యానర్స్ పై హెచ్ .వినోద్ దర్శకత్వంలో తాల అజిత్ హీరోగా తెరకెక్కిన “నెర్కొండ పార్వై”,“వాలిమై”తమిళ మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్ హిట్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న యాక్షన్ ఎడ్వెంచర్ తమిళ మూవీ “#AK 61 ” హైదరాబాద్ లో పూజాకార్యక్రమం జరుపుకుంది. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుపుకున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ పూణె లో జరుగుతుంది.

హరీష్ శంకర్ డైరెక్షన్ లో బన్నీ...!
హరీష్ శంకర్ డైరెక్షన్ లో అల్లు అర్జున్.. ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు సెట్ అయింది.. ఎప్పుడు స్టార్ చేశారు అనుకుంటున్నారా..? అసలు విషయం ఏంటంటే.. హరీష్ డైరెక్షన్ లో బన్నీ నటిస్తున్నాడు. అయితే అది సినిమా కాదు.. ఒక యాడ్ కోసం పనిచేస్తున్నారు. ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు అల్లు అర్జున్. ఆ యాడ్ దర్శకత్వ భాద్యతలు హరీష్ శంకర్ తీసుకున్నారు. దీనికి వరల్డ్ క్లాస్ డీవోపీ సుదీప్ ఛటర్జీ కెమెరా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ యాడ్ షూట్ జరుగుతుంది. ఈ సందర్భంగా హరీశ్ శంకర్ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చే వీడియోను తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

లవ్ స్టోరీస్ , బయోపిక్ మూవీస్ లో నటించాలని ఉంది - రకుల్ ప్రీత్
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రకుల్ ప్రీత్ సింగ్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా తెరకెక్కిన “డాక్టర్ జీ”, “థ్యాంక్ గాడ్” , “మిషన్ సిండ్రెల్లా “, “చ్ఛాత్రివాలి ” ( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “ (తమిళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒక కామెడీ వెబ్ సిరీస్ తో పాటు తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “31 అక్టోబర్ లేడీస్ నైట్ ” మూవీ లో రకుల్ నటిస్తున్నారు. అజిత్ హీరోగా తెరకెక్కనున్న “#AK 61 ” తమిళ మూవీలో రకుల్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

రామారావు ఆన్ డ్యూటీ సెన్సార్ కంప్లీట్..!
క్రాక్ తర్వాత ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజకు ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అయినా కూడా రవితేజ ఎలాంటి నిరాశ చెందకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అంతేకాదు అదే ఫాస్ట్ గా సినిమాలు కంప్లీట్ చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తను రిలీజ్ కు సిద్దం చేసిన సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈసినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పుడో మొదలుపెట్టి ఇప్పటికే టీజర్, ట్రైలర్ పాటలు రిలీజ్ చేయగా అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. రీసెంట్ గానే రామారావు మాస్ నోట్ అంటూ మరో వీడియోను రిలీజ్ చేయగా ట్రైలర్ ను మించి…

‘లైగర్’ యాటిట్యూడ్ గ్లింప్స్ టీజర్ కు ముహూర్తం ఫిక్స్..!
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ తనలోని మాస్ యాంగిల్ ను చూపించి మంచి హిట్ కొట్టిన పూరీ జగన్నాథ్.. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో లైగర్ తో వచ్చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాపై మొదటి నుండీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇక అర్జున్ రెడ్డి తరువాత విజయ్ కు సౌత్ తో పాటు నార్త్ లో కూడా మంచి క్రేజ్ రావడంతో పాన్ ఇండియా రేంజ్ లో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అందరిలో మంచి హైప్ క్రియేట్ చేసిన లైగర్ ఆ తర్వాత ప్రతి అప్ డేట్ తో సినిమా మంచి బజ్ ను క్రియేట్ చేశారు. ఇటీవల అక్డి పక్డి సాంగ్ తో పాటు విజయ్ బోల్డ్ ఫోటో అలానే ట్రైలర్ ఇవన్నీ కూడా అంచనాలు అమాంతం పెంచేసాయి. ఇక…

ప్రభాస్ పై కళ్యాణ్ రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.హీరో కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన పాత్రలలో నటించిన , హై టెక్నికల్ వాల్యూస్, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన…

నెట్ ఫ్లిక్స్ లో "ఆర్ ఆర్ ఆర్" మూవీ సరికొత్త రికార్డ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దక్షిణాది భాషల వెర్షన్స్ జీ 5 లో స్ట్రీమింగ్ కాగా “ఆర్ ఆర్ ఆర్”మూవీ హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ…

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సీతారామం'
హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న పీరియాడిక్ లవ్‌స్టోరీ సీతారామం. 1965 కాలానికి ప్రజెంట్ టైమ్‌ను కలుపుతూ డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా ఈసినిమా వస్తుంది. మహానటి, కనులు కనులను దోచాయంటే సినిమాలతో తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్నాడు దుల్కర్ సల్మాన్. ఇక ఈసినిమా ఆగష్ట్ 5వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోష్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్, పాటలు రిలీజ్ చేయగా వాటికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి…

అందుకే 'ఎన్టీఆర్ 30' ఆలస్యం..!
ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్, రామ్ చరణ్. ఇక ఈసినిమా అయిపోయింది కాబట్టి తమ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ శంకర్ తో చేస్తున్న మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక ఎన్టీఆర్ కొరటాల శివతో తన తరువాత ప్రాజెక్ట్ ను చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తుంది ఎన్టీఆర్ 30వ సినిమా కోసం. ఈసినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా ఇప్పటికే మొదలవ్వాలి కానీ అనుకోకుండా ఆలస్యమవుతూ వస్తుంది. అయితే సెప్టెంబర్ నుండి ఈసినిమా సెట్స్ పైకి వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్టు పలు వార్తలు…

బాలకృష్ణ కు సి.నారాయణ రెడ్డి జీవన సాఫల్య జాతీయ స్వర్ణకంకణ పురస్కారం
హీరో బాలకృష్ణ ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ , ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం NBK 107 షూటింగ్ కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద జరుగుతుంది.

"చంద్రముఖి 2 " మూవీ లో ఐదుగురు హీరోయిన్లు
శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ , నయనతార , జ్యోతిక , ప్రభు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ హారర్ “చంద్రముఖి” తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చంద్రముఖి పాత్రలో జ్యోతిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు “చంద్రముఖి “సీక్వెల్ “చంద్రముఖి 2 ” మూవీ తెరకెక్కుతుంది.

మరో తెలుగమ్మాయి చాందిని చౌదరి కోలీవుడ్ ఎంట్రీ
టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన తెలుగు అమ్మాయిలు అంజలి , రీతూ వర్మ , ఈషా రెబ్బా , శ్రీ దివ్య , బిందు మాధవి , ఆనంది , తేజస్వి సక్సె ఫుల్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో తెలుగు అమ్మాయి చాందిని చౌదరి కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. కోలీవుడ్ లో నటించబోతున్నట్లుగా స్వయంగా చాందిని చౌదరి అధికారికంగా ప్రకటించారు.

సినిమాల నుండి బ్రేక్ తీసుకున్న నిత్యా మీనన్
మలయాళ , తెలుగు , తమిళ , కన్నడ భాషలలో సుమారు 50 సినిమాలలో నటించిన యాక్ట్రెస్ , సింగర్ నిత్యా మీనన్ 8 సంవత్సరాల వయసు లో ఒక ఇంగ్లీష్ మూవీ లో నటించారు. “ఆకాశగోపురం ” తో మలయాళ , “అలామొదలైంది “తో తెలుగు , “నూటరెంబదు “తో తమిళ చిత్ర పరిశ్రమలకు కథానాయికగా పరిచయం అయ్యారు. ” 7 O’ Clock”మూవీ లో సపోర్టింగ్ రోల్ తో నిత్యా మీనన్ కన్నడ చిత్ర పరిశ్రమకు , “మిషన్ మంగళ్ ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు.తెలుగు , తమిళ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన నిత్యా మీనన్ ఒక తమిళ , రెండు మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు.