ప్రస్తుతం దేశవ్యాప్తంగా టాలీవుడ్ సినిమాలు మార్కెట్ పరంగా తమ హవాను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్యకాలంలో ఏ పరిశ్రమ కూడా టాలీవుడ్ అందుకున్న రేంజ్ లో విజయాలను దక్కించుకోలేకపోయాయి. ఇక మరోవైపు టాలీవుడ్ కు టికెట్ల విషయంలో అలానే ఓటీటీ రిలీజ్ ల విషయంలో కూడా గత కొద్దిరోజులుగా గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. కరోనా ముందు వరకూ ఈ సమస్య తలెత్తలేదు కానీ.. కరోనా తరువాత ఓటీటీల ప్రభావం మరీ ఎక్కువైన తరువాత ఈసమస్య మరీ ఎక్కువైంది. ఇక ఈ ఇష్యూపై గత కొద్దిరోజులుగా చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇటీవలే టాలీవుడ్ నిర్మాతలు టికెట్ల రేట్లపై చర్చలు జరిపి టికెట్ రేట్లను ఫిక్స్ చేశారు. ఇక ఓటీటీలో కూడా పెద్ద సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేయాలి, చిన్న సినిమాలు ఎప్పుడూ రిలీజ్ చేయాలి అన్న దానిపై కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయినా కూడా ఇంకా ఈ సమస్యలపై క్లారిటీ రాలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలో నిర్మాతల మండలి ఓ ప్రకటన ఇచ్చారు. కరోనా తరువాత ఇండస్ట్రీలో రెవెన్యూ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి.. రేట్లు పెరిగాయి.. ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించడం నిర్మాతల మండలికి చాలా ముఖ్యమైన అంశం. మా సినిమాలను ఆరోగ్యవంతమైన వాతావరణలో రిలీజ్ చేయడం అనేది మా భాద్యత.. ఈనేపథ్యంలో నిర్మాతలందరూ కలిసి ఆగష్ట్ 1 నుండి షూటింగ్ లను హోల్డ్ లో పెట్టి ఈ సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: