“విక్రాంత్ రోణ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ..

Vikrant Rona Pre Release Event Highlights,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikrant Rona,Vikrant Rona Movie,Vikrant Rona Telugu Movie,Vikrant Rona Movie Pre Release Event,Vikrant Rona Telugu Movie Pre Release Event,Vikrant Rona Movie Pre Release Event Highlights, Kiccha Sudeep,Hero Kiccha Sudeep,Kiccha Sudeep Vikrant Rona Movie,Kiccha Sudeep Vikrant Rona Pre Release Event Highlights,Kiccha Sudeep Upcoming Movie Vikrant Rona, Jacqueline Fernandez,Actress Jacqueline Fernandez,Jacqueline Fernandez in Vikrant Rona,Jacqueline Fernandez and Kiccha Sudeep upcoming Movie Vikrant Rona,King Nagarjuna Chief Guest For Vikrant Rona Movie Pre Release Event, king Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna at Pre Release Event of Vikrant Rona

కిచ్చా క్రియేషన్స్ , షాలిని ఆర్ట్స్ , ఇన్వెనియో ఫిల్మ్స్ ఇండియా బ్యానర్స్ పై అనూప్ భండారి దర్శకత్వంలో సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ ” విక్రాంత్ రోణ”కన్నడ మూవీ జులై 28 వ తేదీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. నీతా అశోక్ , జాక్వెలెన్ ఫెర్నాండెజ్ కథానాయికలు. నిరూప్ భండారి, రవిశంకర్ గౌడ ముఖ్య పాత్రలలో నటించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“విక్రాంత్ రోణ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాగార్జున మాట్లాడుతూ – సుదీప్‌ ఇప్పటికే హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించేశారనీ , అందరికీ నటుడిగా సుదీప్‌ సుపరిచితుడనీ , ఇక ‘విక్రాంత్‌ రోణ’ సినిమా షూటింగ్‌ దాదాపు 70 శాతం అన్నపూర్ణ సెవెన్‌ ఏకర్స్‌లోనే జరిగిందనీ , సాధారణంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరించిన కొన్ని సినిమాలకు సంబంధించిన పోస్టర్స్‌ను మేం పెడుతుంటామనీ , ఆ సినిమాల్లో మేం కూడా భాగమయ్యామనే గర్వంతో అలా చేస్తామనీ , . ఇంతకుముందు “బాహుబలి”, “ఆర్‌ఆర్‌ఆర్‌”మూవీస్ పోస్టర్స్ పెట్టామనీ , ఇప్పుడు “విక్రాంత్‌ రోణ” పోస్టర్‌ పెట్టాలని ఉందనీ చెప్పారు. హీరో సుదీప్ మాట్లాడుతూ ..తాను థియేటర్స్‌లో చూసిన తొలి సినిమా నాగార్జునగారి “శివ” అనీ , అప్పట్లో సైకిల్‌ చైన్‌తో కొట్టడం అనేది స్టయిల్‌గా మారిపోయిందనీ ,
“ఈగ”, “బాహుబలి”, “సైరా: నరసింహారెడ్డి” చిత్రాల్లో యాక్టర్‌గా తనను తెలుగు ప్రేక్షకులు ఆదరించారనీ , “విక్రాంత్‌ రోణ”ను కూడా ఆదరించి, హిట్‌ చేయాలనీ చెప్పారు. దర్శకుడు అనూప్ భండారి మాట్లాడుతూ .. నాగార్జునగారి “గీతాంజలి” సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాననీ , తన తొలి స్క్రిప్ట్‌ సుదీప్‌గారి కోసమే రాసుకున్నాననీ , “విక్రాంత్‌ రోణ” తన ఇరవయ్యేళ్ల కల అనీ , సుదీప్‌గారితో వర్క్‌ చేయడం సంతోషంగా ఉందనీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − ten =