ఒక మ‌ల్టీప్లెక్స్ ఛైన్ లో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన చిత్రంగా”కె జి ఎఫ్ చాప్టర్ 2″

KGF Chapter 2 Creates Another Record,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Telugu Movie,KGF Chapter 2 Pan Indian Movie,KGF Chapter 2 Creates Records,KGF Chapter 2 Movie Creates Another Record, Yash KGF Chapter 2 Movie Latest Records,KGF Chapter 2 Movie New Records,KGF Fame Hero Yash,Yash Block Buster Movie KGF Chapter 2,Srinidhi Shetty,Actress Srinidhi Shetty, Yash and Srinidhi Shetty KGF Chapter 2 Movie latest Updates,KGF Chapter 2 Movie Collections,KGF Chapter 2 Box Office Collections,KGF Chapter 2 World Wide Collections Updates, KGF Chapter 2 Collects Rs121 Crores in Multiplex Chain,KGF Chapter 2 Movie Creates Record in Multiplex Chain To Collect Rs121 Crores

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రీ నిధి శెట్టి కథానాయిక . రవి బస్రూర్ సంగీతం అందించారు.“కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.అంచనాలకు తగ్గట్టుగా తెరకెక్కిన “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ అన్ని భాషలలోను విశేష ప్రేక్షకాదరణ పొందింది. “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1240 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ఒక అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకుంది. దేశంలో ఒక మ‌ల్టీప్లెక్స్ ఛైన్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన చిత్రంగా నిలిచింది.ఇప్ప‌టిదాకా ఇండియాలో ఏ సినిమా కూడా ఒక మ‌ల్టీప్లెక్స్ ఛైన్లో రూ.100 కోట్ల క‌లెక్ష‌న్ల‌ మార్కును కూడా అందుకోలేదు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ఇండియాలో అత్య‌ధిక స్క్రీన్లు ఉన్న పీవీఆర్ మల్టీప్లెక్సుల్లో రూ.94 కోట్ల దాకా గ్రాస్ క‌లెక్ట్ చేసింది. ఇప్పుడు “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ పీవీఆర్ మల్టీప్లెక్సుల్లో రూ.121 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + four =