
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 70


రిలీజ్ డేట్ లాక్ చేసిన శివ కార్తికేయన్ ప్రిన్స్

ది ఘోస్ట్ మూవీ విడుదలకు తగ్గేదేలే

అల్లు అర్జున్ తో వర్క్ చేయాలనుంది

ఒకే ఒక జీవితం మూవీ పై హీరో నాని ప్రశంసలు

కృష్ణ వ్రింద విహారి ప్రమోషన్స్ కోసం పాదయాత్ర

గాడ్ ఫాదర్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

లారెన్స్ ఎమోషనల్-కడసారి చూడలేకపోయా

తాజా చిత్రానికి వైష్ణవ్ తేజ్ న్యూ మేకోవర్


మాస్ మహారాజా రవితేజ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ ?

#SSMB 28 ఫస్ట్ డే షూటింగ్ గ్లింప్స్

ప్రభాస్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు

ప్రముఖ నిర్మాణ సంస్థలో విజయ్ 100 సినిమా

ఉపేంద్ర కబ్జ ఫైనల్ రిలీజ్ డేట్ ఫిక్స్

సెన్సేషనల్ బ్యాక్ డ్రాప్ తో #SSMB 29

పలు రికార్డ్స్ క్రియేట్ చేసిన బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ
స్టార్ స్టూడియోస్ , ధర్మా ప్రొడక్షన్స్ , స్టార్ లైట్ పిక్చర్స్ ,ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , అలియా భట్ జంటగా సోషియో ఫాంటసీ బ్రహ్మాస్త్ర హిందీ మూవీ 3 పార్ట్స్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ హిందీ మూవీ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి బాలీవుడ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు , ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీ లో కింగ్ నాగార్జున , అమితాబ్ బచ్చన్ , మౌని రాయ్ , డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటించగా బాలీవుడ్ బాద్ షా అతిథి పాత్రలో నటించారు. ప్రీతం…

రిలీజ్ డేట్ లాక్ చేసిన శివ కార్తికేయన్ ప్రిన్స్
జాతి రత్నాలు సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతూ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు డైరెక్టర్ అనుదీప్. ఇక రెండో సినిమా ఏకంగా తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా చేస్తున్న సినిమా ప్రిన్స్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. ఇక షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టింది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేశారు.

ది ఘోస్ట్ మూవీ విడుదలకు తగ్గేదేలే
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సూపర్ హిట్ PSV గరుడ వేగ మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్ మూవీ విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5న విడుదల కానుంది. సోనాల్ చౌహాన్ కథానాయిక కాగా మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటించారు. ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటించారు. భరత్ శౌరభ్ సంగీతం అందించారు.హీరో నాగార్జున , సోనాల్ చౌహాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్స్ గా నటించిన ది ఘోస్ట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను…

అల్లు అర్జున్ తో వర్క్ చేయాలనుంది
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ఏ స్థాయిలో పెరిగిందో చూస్తూనే ఉన్నాం. పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన బన్నీ మొదటి ప్రయత్నంతోనే సంచలన విజయం దక్కించుకోవడంతో పాటు నార్త్ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. తన నటన, యాస, మేకోవర్ తో అందరినీ ఫిదా చేసేశాడు. ఇక పుష్ప సినిమా తరువాత బన్నీకి సెలబ్రిటీల నుండి ఫాలోయింగ్ బాగానే పెరిగింది. చాలా మంది నటీనటులు బన్నీతో నటించాలని ఉందని పలుచోట్ల చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు డైరెక్టర్లు కూడా బన్నీతో సినిమా చేయాలని ఉందని చెప్పిన వారు ఉన్నారు.

ఒకే ఒక జీవితం మూవీ పై హీరో నాని ప్రశంసలు
డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీ కార్తిక్ దర్శకత్వంలో శర్వానంద్ , రీతూ వర్మ జంటగా , సీనియర్ హీరోయిన్ అమల ఒక కీలక పాత్రలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన ఒకే ఒక జీవితం మూవీ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది.హీరో శర్వానంద్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ ఫీల్ గుడ్ సీక్వెన్స్ స్ లో శర్వానంద్ చాలా బాగా నటించారు. తల్లి పాత్రలో నటించిన అమల తన నటనతోనూ మరియు తన స్మైల్ తోనూ ఆకట్టుకున్నారు. హీరోయిన్ గా నటించిన రీతూ వర్మ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ…

కృష్ణ వ్రింద విహారి ప్రమోషన్స్ కోసం పాదయాత్ర
ఒక సినిమాకు ప్రమోషన్స్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రమోషన్స్ లో ఎంత కొత్త దనం చూపిస్తే అంత బజ్ క్రియేట్ అవుతుంది సినిమాపై. ఆడియన్స్ లో లో క్యూరియాసిటీని పెంచుతుంది. అందుకే మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో కొత్తగా ఆలోచిస్తుంటారు. కొత్త కొత్త థాట్స్ ముందుకు తీసుకొస్తుంటారు. ఇక ఇప్పుడు కృష్ణ వ్రింద విహారి టీమ్ కూడా అదే ఆలోచనతో ముందుకొస్తుంది. అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కృష్ణ వ్రింద విహారి. ఈసినిమా సెప్టెంబర్ 23వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్.

గాడ్ ఫాదర్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ సినిమా లూసిఫర్ సినిమా రీమేక్ తో వస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్స్ పై కూడా ఇప్పటినుండే దృష్టిపెట్టారు. ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగానే వరుస అప్ డేట్స్ తో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక నయనతార అలానే సత్యదేవ్ ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేయగా అవి కూడా ఆకట్టుకున్నాయి. అలాగే ఇటీవల విడుదలైన టీజర్ తో మూవీని నెక్స్ట్…

లారెన్స్ ఎమోషనల్-కడసారి చూడలేకపోయా
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సంచలన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రెబల్ స్టార్ మొన్న తుది శ్వాస విడిచారు. ఇక కృష్ణంరాజు మరణంతో కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, సన్నిహితులు అందరూ విచారంలోనే ఉన్నారు. ఇక నిన్న కృష్ణంరాజు అంత్యక్రియలు జరిగాయి. ఇక కృష్ణంరాజును చివరిసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

తాజా చిత్రానికి వైష్ణవ్ తేజ్ న్యూ మేకోవర్
హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ బ్లాక్ బస్టర్ ఉప్పెన మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , కృతిశెట్టి జంటగా తెరకెక్కిన ఉప్పెన మూవీ ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కిన కొండపొలం , శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ పై గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , కేతిక శర్మ జంటగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రంగ రంగ వైభవంగా మూవీస్ ప్రేక్షకాదరణ పొందలేదు.

కె జి ఎఫ్ చాప్టర్ 2 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను క్రాస్ చేసిన బ్రహ్మాస్త్ర పార్ట్1 శివ
స్టార్ స్టూడియోస్ , ధర్మా ప్రొడక్షన్స్ , స్టార్ లైట్ పిక్చర్స్ ,ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , అలియా భట్ జంటగా సోషియో ఫాంటసీ బ్రహ్మాస్త్ర హిందీ మూవీ 3 పార్ట్స్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ హిందీ మూవీ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి బాలీవుడ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు , ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీ లో కింగ్ నాగార్జున , అమితాబ్ బచ్చన్ , మౌని రాయ్ , డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటించగా బాలీవుడ్ బాద్ షా అతిథి పాత్రలో నటించారు. ప్రీతం…

సెన్సార్ పూర్తిచేసుకున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
రొటీన్ భిన్నంగా ఉండే సినిమాలు చేయడానికి ముందుకొస్తున్న హీరోల్లో సుధీర్ బాబు కూడా ముందుంటాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఈయన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రతి అప్ డేట్ సినిమాపై ఆసక్తిని పెంచాయి,

మాస్ మహారాజా రవితేజ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ ?
మాస్ మహారాజా రవితేజ హీరోగా ధమాకా ! , రావణాసుర , టైగర్ నాగేశ్వర రావు మూవీస్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీస్ తో పాటు రవితేజ , మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న MEGA 154 మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో రవితేజ ఇటీవలే బ్లాక్ బస్టర్ కార్తికేయ 2 మూవీ ఫేమ్ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్‌తో రివెంజ్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్ళనుంది.

#SSMB 28 ఫస్ట్ డే షూటింగ్ గ్లింప్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. అతడు, ఖలేజా సినిమాల తరువాత దాదాపు 12 ఏళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఇక ఈసినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూాశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయి చాలా కాలం అయినా కూడా ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడానికి చాలా టైమ్ పట్టింది. ఫైనల్ గా నిన్ననే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్.

ప్రభాస్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు
రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి చెందిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మొన్న తుది శ్వాస విడిచారు. ఇక ఆయన అంత్యక్రియలు నిన్న జరిపారు. జూబ్లీహిల్స్ నుండి కనకమామిడి ఫాంహౌస్ వరకు కొనసాగిన అంతిమయాత్రలో ఎంతోమంది జనం పాల్గొన్నారు. తమ అభిమాన నటుడిని చివరిసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. ఇక మరోవైపు అందరూ కృష్ణంరాజు గురించి తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు.

పోల్ గేమ్ : సెప్టెంబర్ 16 వ తేదీ రిలీజ్ కానున్న ఏ మూవీ కి మీ ఓటు ?
సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా కసాండ్రా మరియు నివేదా థామస్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ శాకినీ ఢాకిని మూవీ సెప్టెంబర్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. దక్షిణ కొరియా యాక్షన్ కామెడీ చిత్రం మిడ్‌నైట్ రన్నర్స్ మూవీ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ కి మైకీ మేక్ క్లియరీ , నరేష్ కుమారన్ సంగీతం అందించారు.ఈ మూవీ లో యాక్షన్ సీన్స్ కై రెజీనా , నివేదా మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకొనడం విశేషం.శాకినీ డాకిని మూవీ నుండి చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ప్రముఖ నిర్మాణ సంస్థలో విజయ్ 100 సినిమా
తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటివరకూ తన డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన విజయ్ ఇప్పుడు స్ట్రైయిట్ గా తెలుగు సినిమాతో వచ్చేస్తున్నాడు. తెలుగ, తమిళ్ రెండు భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. తమిళ్ లో వారసి టైటిల్ తో వస్తుండగా.. తెలుగులో వారసుడు అనే టైటిల్ తో వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.

ఉపేంద్ర కబ్జ ఫైనల్ రిలీజ్ డేట్ ఫిక్స్
విభిన్నమైన సినిమాలు చేయడంలో కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర ఎప్పుడూ ముందుంటాడు. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి కథతోనే రాబోతున్నాడు. చంద్రు దర్శకత్వంలో ఉపేంద్ర , స్టార్ హీరో సుదీప్ ప్రధాన పాత్రల్లో వస్తున్న మల్టీ స్టారర్ కబ్జ. గతంలో చంద్రు-ఉపేంద్ర కాంబినేషన్ లో బ్రహ్మా, ఐ లవ్ యూ అనే సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వస్తుంది మూడో సినిమా. ఇక ఈసినిమాను కన్నడతో పాటు తెలుగుతో పాటు పలు భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. నిజానికి ఈసినిమా షూటింగ్ కే చాలా బ్రేకులు పడ్డాయి. అయితే ఎలాగో షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. కానీ రిలీజ్ కు కూడా చాలా ఆలస్యమవుతూ వచ్చింది. ఇక మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్స్…

సెన్సేషనల్ బ్యాక్ డ్రాప్ తో #SSMB 29
శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కనుంది. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB 28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.ఫ్యామిలీ ఎలిమెంట్స్ తోపాటు యాక్షన్ సీన్స్ తో తెరకెక్కనున్న #SSMB 28 మూవీ రెగ్యులర్ షూటింగ్ హై దరాబాద్ లో రూపొందించిన ప్రత్యేక సెట్ లో భారీ యాక్షన్ సీన్ తో నిన్న ప్రారంభం అయిన విషయం తెలిసిందే.

ఓటీటీ లో సీతా రామం మూవీ కి అద్భుత రెస్పాన్స్
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన సీతారామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న సీతా రామం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు…

8 మంది ముఖ్య అతిథిలు గా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్రీ రిలీజ్ ఈవెంట్
బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో యువ హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ సెప్టెంబర్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. శ్రీనివాస్ అవసరాల , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.