జాతి రత్నాలు సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతూ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు డైరెక్టర్ అనుదీప్. ఇక రెండో సినిమా ఏకంగా తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా చేస్తున్న సినిమా ప్రిన్స్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. ఇక షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టింది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమను అక్టోబర్ 21వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక మరోసారి ఈసినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చాడు అనుదీప్. శాకిని డాకినీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనుదీప్ కూాడా పాల్గొన్నాడు. ఈసందర్భంగా అనుదీప్ ప్రిన్స్ రిలీజ్ ను కన్ఫామ్ చేశాడు. ప్రిన్స్ సినిమా ముందుగా చెప్పినట్టే అక్టోబర్ 21వ తేదీనే రిలీజ్ అవుతున్నట్టు స్పష్టం చేశాడు.
కాగా ఈసినిమాలో శివ కార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె. నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: