పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ఏ స్థాయిలో పెరిగిందో చూస్తూనే ఉన్నాం. పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన బన్నీ మొదటి ప్రయత్నంతోనే సంచలన విజయం దక్కించుకోవడంతో పాటు నార్త్ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. తన నటన, యాస, మేకోవర్ తో అందరినీ ఫిదా చేసేశాడు. ఇక పుష్ప సినిమా తరువాత బన్నీకి సెలబ్రిటీల నుండి ఫాలోయింగ్ బాగానే పెరిగింది. చాలా మంది నటీనటులు బన్నీతో నటించాలని ఉందని పలుచోట్ల చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు డైరెక్టర్లు కూడా బన్నీతో సినిమా చేయాలని ఉందని చెప్పిన వారు ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్ కూడా ఈ లిస్ట్ లో చేరిపోయాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు రీసెంట్ గా శర్వానంద్ తో ఒకే ఒక జీవితం లాంటి ఎమోషనల్ సినిమాను తీసి హిట్ అందుకున్న శ్రీ కార్తిక్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీకార్తిక్.. తనకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో వర్క్ చేయాలని ఉందని తన కోరికను బయటపెట్టాడు. అంతేకాదు.. తాను చెన్నైలో ఉన్నప్పటినుండే అల్లు అర్జున్ అంటే ఇష్టమని.. తనకు కథను చెప్పాలని అనుకున్నట్టు తెలిపాడు. ఇప్పటికే అల్లుఅర్జున్ కోసం స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నానని.. అది ఫాంటసీ జోనర్ ఉంటుందని కూడా స్పష్టం చేశాడు. మరి చూద్దాం ఒకే ఒక జీవితం హిట్ కాబట్టి అల్లు అర్జున్ శ్రీకార్తిక్ కు కథ వినే ఛాన్స్ ఇస్తాడేమో..
కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా కోసం సిద్దమవుతున్నాడు. రీసెంట్ గానే ఈసినిమాను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు. త్వరలో షూటింగ్ ను ప్రారంభించనున్నారు. మరోవైపు శ్రీ కార్తిక్ టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో ఒకే ఒక జీవితం తీసి హిట్ కొట్టాడు. ఈసినిమాలో శర్వానంద్ హీరోగా నటించగా రీతూవర్మ హీరోయిన్ గా నటించింది. అమల, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ఆలీ, మధు నందన్ కీలక పాత్రల్లో నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ఈసినిమాను నిర్మించారు. జెక్స్ బిజోయ్ సంగీతం అందించగా.. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: