మాస్ మహారాజా రవితేజ హీరోగా ధమాకా ! , రావణాసుర , టైగర్ నాగేశ్వర రావు మూవీస్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీస్ తో పాటు రవితేజ , మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న MEGA 154 మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో రవితేజ ఇటీవలే బ్లాక్ బస్టర్ కార్తికేయ 2 మూవీ ఫేమ్ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్‌తో రివెంజ్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్ళనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మూవీ కి ఈగిల్ టైటిల్ పరిశీలనలో ఉంది. హీరో రవితేజ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ ఎంపిక అయినట్టు సమాచారం. కార్తికేయ 2 మూవీ సక్సె ను ఎంజాయ్ చేస్తున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం తళ్ళిపోగాదే , తలై నగరం 2 తమిళ మూవీస్ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న 18 పేజెస్ , బటర్ ఫ్లై మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఈ కొత్త కాంబినేషన్ ఎలాఉంటుందో వేచిచూడాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: