శాకినీ ఢాకిని : సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా కసాండ్రా మరియు నివేదా థామస్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ శాకినీ ఢాకిని మూవీ సెప్టెంబర్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. దక్షిణ కొరియా యాక్షన్ కామెడీ చిత్రం మిడ్‌నైట్ రన్నర్స్ మూవీ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ కి మైకీ మేక్ క్లియరీ , నరేష్ కుమారన్ సంగీతం అందించారు.ఈ మూవీ లో యాక్షన్ సీన్స్ కై రెజీనా , నివేదా మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకొనడం విశేషం.శాకినీ డాకిని మూవీ నుండి చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నేను మీకు బాగా కావాల్సినవాడిని : కోడి దివ్యా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శ్రీధర్ గాదే దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం , సంజనా ఆనంద్ , సోనూ ఠాకూర్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన నేను మీకు బాగా కావాల్సినవాడిని మూవీ సెప్టెంబర్ 16 వ తేదీ రిలీజ్ కానుంది.మణిశర్మ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం హీరోగా వినరో భాగ్యము విష్ణు కథ , మీటర్ , రూల్స్ రంజన్ మూవీస్ తెరకెక్కుతున్నాయి.
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి : బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో యువ హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ సెప్టెంబర్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. శ్రీనివాస్ అవసరాల , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, హీరో సుధీర్ బాబు కాంబినేషన్లో సమ్మోహనం , V మూవీస్ తరువాత తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[totalpoll id=”87248″]
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: