
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 218


'బంగార్రాజు' ట్రైలర్ అప్ డేట్

అల్లు అర్జున్ పై అర్జున్ కపూర్ ప్రశంసలు

నువ్వు ఎప్పటికీ నా అన్నయ్యవే.. మహేష్ ఎమోషనల్..!

"బంగార్రాజు "మ్యూజికల్ నైట్

'అర్హ' నా బెస్ట్ టైమ్ పాస్

'7 డేస్ 6 నైట్స్'.. సంక్రాంతి బరి నుంచి ఔట్

టాలీవుడ్ లో యువ తారల హంగామా

"#RC 15" మూవీ కై చెన్నైలో రామ్ చరణ్

'దేవరశాంటా' విజేతలను అనౌన్స్ చేసిన 'రౌడీ స్టార్'

'రాధేశ్యామ్'.. హిందీ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

"బంగార్రాజు" మూవీ ప్రమోషన్స్ షురూ

స్లో మూవ్ మెంట్స్ తో పూజాహెగ్డే వర్కవుట్

సత్యరాజ్ కు కరోనా పాజిటివ్

స్టార్ హీరోయిన్ త్రిష కు కరోనా పాజిటివ్

పవన్ కళ్యాణ్ రష్యా వెకేషన్ పూర్తి

'నాగ చైతన్య' నా ఫస్ట్ డ్యాన్స్ కో స్టార్

విదేశాలలో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్

హీరో ప్రభాస్ పై అశ్వినీ దత్ సెన్సేషనల్ కామెంట్స్
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో ప్రభాస్ క్లాప్ తో షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న “ప్రాజెక్ట్ K ” మూవీ షూటింగ్ లో అమితాబ్ 5 రోజుల పాటు పాల్గొని ఒక చిన్న షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు. తరువాత హీరో ప్రభాస్ , దీపిక పాల్గొన్న షూటింగ్ షెడ్యూల్ జరిగిన విషయం తెలిసిందే.

'బంగార్రాజు' ట్రైలర్ అప్ డేట్
చాలా సినిమాలు ఎప్పటి నుండో రిలీజ్ కు సిద్దంగా ఉన్నా.. ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయాయి. కానీ బంగార్రాజు సినిమా మాత్రం మొదలుపెట్టడమే లేట్ అయినా కూడా చాలా వేగంగా షూటింగ్ ను ఇతర పనులను కూడా పూర్తిచేసుకొని సంక్రాంతి రిలీజ్ కు సిద్దమైంది. సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో ప్రస్తుతం అంచనాలు ఉన్న సినిమా ఇదే. ఇక రిలీజ్ కు చాలా తక్కువ రోజులే ఉండటంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి పోస్టర్లు, టీజర్, పాటలు రిలీజ్ చేయగా అవి సినిమాపై అంచనాలను పెంచేశాయి.

అల్లు అర్జున్ పై అర్జున్ కపూర్ ప్రశంసలు
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా సుమారు 300కోట్లు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. “పుష్ప: ది రైజ్” మూవీ హిందీ వెర్షన్ బాలీవుడ్ లో 75 కోట్ల భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది . రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుత పెర్ఫార్మెన్స్ కు టాలీవుడ్ హీరోలతో పాటు బాలీవుడ్ హీరోలు కూడా ప్రశంసలు…

నువ్వు ఎప్పటికీ నా అన్నయ్యవే.. మహేష్ ఎమోషనల్..!
సినీ పరిశ్రమకు ఒక దాని తర్వాత మరో దెబ్బ తగులుతూనే ఉంది. గత రెండేళ్లలోనే ఎంతో మంది సినీ ప్రముఖులను సినీ పరిశ్రమ కోల్పోయింది. కరోనా వల్ల ఎంతో మంది లెజెండరీలను కోల్పోవాల్సి వచ్చింది. కొంతమంది అకాల మరణం చెందారు. ఇక ప్రస్తుతం కరోనా వల్ల రోజుకో సెలబ్రిటీ కరోనా బారిన పడుతున్నారు. ఈనేపథ్యంలో మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మరణించిన వార్త ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు రమేష్ బాబు. అది కాస్త సీరియస్ అవ్వగా ఆస్పత్రికి తరలించే క్రమంలో తుదిశ్వాస విడిచారు. ఇక రమేష్ బాబు మరణంతో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ…

"బంగార్రాజు "మ్యూజికల్ నైట్
జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “బంగార్రాజు ” మూవీ జనవరి 14 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. హీరో నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటించారు. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ”బంగార్రాజు ” మూవీ లో “జాతిరత్నాలు ” మూవీ ఫేమ్ ఫరియా , "జాంబి రెడ్డి "మూవీ ఫేమ్ దక్ష నాగర్కర్ స్పెషల్ సాంగ్స్ లో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన…

'అర్హ' నా బెస్ట్ టైమ్ పాస్
అల్లు అర్జున్ సినిమాలు, షూటింగ్ లు పక్కన పెడితే మంచి ఫ్యామిలీ మ్యాన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఖాళీ సమయాల్లో పిల్లలు అర్హ, అయాన్ లతో టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. వారిలో అర్హ చేసే అల్లరి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జన్, స్నేహా రెడ్డి ఇద్దరూ సోషల్ మీడియాలో అర్హ కు సంబంధించిన ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ తన ఇన్ట్సా ద్వారా అర్హతో ఉన్న క్యూట్ పిక్ ను పోస్ట్ చేస్తూ బెస్ట్ టైమ్ పాస్ అర్హ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఫొటో నెటిజన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. బన్నీ ఫ్యాన్స్ క్యూట్ అంటూ కామెంట్స్…

'7 డేస్ 6 నైట్స్'.. సంక్రాంతి బరి నుంచి ఔట్
కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సినిమా రిలీజ్ లు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా వరకు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండగా రిలీజ్ డేట్ లను వాయిదా వేసుకున్నాయి. ఆ లిస్ట్ లో ఇప్పుడు 7 డేస్ 6 నైట్స్ ఈసినిమా కూడా చేరిపోయింది. మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించిన నిర్మాత ఎం.ఎస్ రాజు. ఆ తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఎం. ఎస్. రాజు ‘డర్టీ హరి’ లాంటి సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇక ఆసినిమా ఇచ్చిన జోష్ తో ఒక న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’ తో మరోసారి ప్రేక్షకుల…

ఫైట్ మాస్టర్స్ దర్శకత్వంలో డ్యాన్స్ మాస్టర్ హీరోగా "దుర్గ "
డ్యాన్సర్ , డ్యాన్స్ డైరెక్టర్ , హీరో , డైరెక్టర్ లారెన్స్ తన స్వంత బ్యానర్ రాఘవేంద్ర ప్రొడక్షన్స్ లో ”దుర్గ” అనే టైటిల్ తో ఒక మూవీ ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా "దుర్గ "మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది . ముసలి అవతారంలో భయానకంగా ఉన్న లారెన్స్ లుక్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. హారర్ థ్రిల్లర్ చిత్రాలతో భయపెట్టిన లారెన్స్ లుక్ తోటే భయపెట్టారు.

టాలీవుడ్ లో యువ తారల హంగామా
బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతిశెట్టి ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. 2021 సంవత్సరం లో కృతి శెట్టి “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” మూవీస్ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. కృతిశెట్టి ప్రస్తుతం “#RAPO 19 “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”, “బంగార్రాజు “, “మాచర్ల నియోజకవర్గం”మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

"#RC 15" మూవీ కై చెన్నైలో రామ్ చరణ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో “#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో జయరాం , అంజలి, శ్రీకాంత్ , సునీల్ కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం.”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. పుణె లో #RC15” మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే.

'దేవరశాంటా' విజేతలను అనౌన్స్ చేసిన 'రౌడీ స్టార్'
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ముద్దుగా రౌడీ హీరో అని పిలుచుకునే విజయ్ దేవరకొండ కు ప్రస్తుతం ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమా తన సినీ కెరీర్ నే మార్చేసింది. ఆ తరువాత కూడా మంచి హిట్స్ కొట్టడంతో అటు తెలుగులోనే కాదు నార్త్ లో కూడా విజయ్ దేవరకొండకు సూపర్ క్రేజ్ పెరిగిపోయింది. ఇక విజయ్ కూడా కేవలం సినిమాలతోనే కాదు.. తను చేసే విభిన్నమైన పనుల ద్వారా కూడా ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. అటు సినిమాలతో పాటు నిర్మాతగా మరోవైపు బిజినెస్ రంగంలోకి కూడా దిగి తన టాలెంట్ తో ఎంతోమంది యువతకు స్పూర్తిదాయకంగా నిలుస్తున్నాడు.

'రాధేశ్యామ్'.. హిందీ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్
రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా రాధేశ్యామ్. ఈసినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కరోనా థర్ట్ వేవ్ ప్రభావం మళ్లీ ఎక్కువ అవ్వడం.. దానికి తోడు కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు కూడా మూతపడుతుండటంతో సంక్రాంతికి రావాల్సిన సినిమాను వాయిదా వేశారు. మళ్లీ పరిస్థితులు కాస్త నార్మల్ గా వచ్చిన తరువాత రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికేే ఈసినిమా నుండి వచ్చిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి.

"బంగార్రాజు" మూవీ ప్రమోషన్స్ షురూ
జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “బంగార్రాజు ” మూవీ జనవరి 14 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. హీరో నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటించారు. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ”బంగార్రాజు ” మూవీ లో “జాతిరత్నాలు ” మూవీ ఫేమ్ ఫరియా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను…

స్లో మూవ్ మెంట్స్ తో పూజాహెగ్డే వర్కవుట్
టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. 9 సంవత్సరాల తరువాత కోలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే , స్టార్ హీరో విజయ్ కు జోడీగా “బీస్ట్ ” తమిళ మూవీ లో నటిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ ను పూజాహెగ్డే కంప్లీట్ చేశారు.స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్నారు. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “#SSMB28” , “#PSPK 28” మూవీస్ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.

సత్యరాజ్ కు కరోనా పాజిటివ్
గత రెండేళ్లుగా కరోనా వల్ల సినీ పరిశ్రమ ఎంత దెబ్బతిందో చూస్తూనే ఉన్నాం. ఇక మళ్లీ థర్డ్ వేవ్ అలా మొదలైందో లేదో అప్పుడు దాని ప్రభావం సినీ పరిశ్రమపై చూపిస్తూనే ఉంది. ఇప్పటికే దీనివల్ల థియేటర్లు మూతపడుతున్నాయి. దాంతో సినిమాల రిలీజ్ లు కూడా ఆగిపోతున్నాయి. దీనికితోడు వరుసగా సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ప్రతి రోజు తాము కరోనా బారిన పడ్డామని ఎవరో ఒక సెలబ్రిటీ తమ సోషల్ మీడియా ద్వారా చెబుతూనే ఉన్నారు. గత కొద్దిరోజులు కిందటే మంచు మనోజ్, విశ్వక్సేన్, మంచు లక్ష్మీ కరోనా గురించి చెప్పగా.. రెండు రోజుల కిందటే ప్రిన్స్ మహేష్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కు కరోనా వచ్చింది. తాజాగా స్టార్…

స్టార్ హీరోయిన్ త్రిష కు కరోనా పాజిటివ్
తమిళ , తెలుగు భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో త్రిష తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. త్రిష కథానాయికగా రూపొందిన పలు మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు. త్రిష కథానాయికగా రూపొందిన ‘గర్జన “, “సేతురంగ వెట్టై 2”, “రాంగి ” , “పొన్నియిన్ సెల్వన్ “ తమిళ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. త్రిష ప్రస్తుతం“రామ్ ” (మలయాళ ) , “ద్విత్వ ” కన్నడ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తెలుగు వెబ్ సిరీస్”బ్రింద” షూటింగ్ ప్రారంభం అయ్యింది.

పవన్ కళ్యాణ్ రష్యా వెకేషన్ పూర్తి
బ్లాక్ బస్టర్ "వకీల్ సాబ్ "మూవీ తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన "భీమ్లా నాయక్ "మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న "హరి హర వీరమల్లు "మూవీ సెట్స్ పై ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో "భవదీయుడు భగత్ సింగ్ " మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

'నాగ చైతన్య' నా ఫస్ట్ డ్యాన్స్ కో స్టార్
మనం లాంటి క్లాసిక్ సినిమా తరువాత మరోసారి వెండితెర పై సందడి చేయడానికి వస్తున్నారు కింగ్ నాగార్జున తనయుడు నాగచైతన్య. ఈసారి బంగార్రాజు సినిమాతో వచ్చేస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు వస్తున్న సీక్వెల్ ఇది. ఇప్పటికే ఈసినిమా నుండి ఏ అప్ డేట్ వచ్చినా అవి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగుతుంది ఈసినిమా.

'కె.జి.యఫ్ 2'.. రాకీ భాయ్ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా రూపొందిన సినిమా ‘కె.జి.యఫ్ ఛాప్టర్ 2’. ఈసినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా కన్నడ చిత్ర పరిశ్రమకు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. ఇక పార్ట్ వన్ ఇచ్చిన ఎనర్టీతో ఇప్పుడు ఛాప్టర్ 2 వస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఈసినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో కూడా తెలుసు. మరి ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ తెలిసిందే కదా కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా ఈఏడాది ఏప్రిల్ 14న ప్రపంచం వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కోబోతుంది.

విదేశాలలో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ"రాధేశ్యామ్ "సంక్రాంతి కి విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. "ఆదిపురుష్ "మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన ప్రభాస్ ప్రస్తుతం "సలార్ ", "ప్రాజెక్ట్ K " మూవీస్ లో నటిస్తున్నారు. "అర్జున్ రెడ్డి " మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న "స్పిరిట్ " మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.