డ్యాన్సర్ , డ్యాన్స్ డైరెక్టర్ , హీరో , డైరెక్టర్ లారెన్స్ తన స్వంత బ్యానర్ రాఘవేంద్ర ప్రొడక్షన్స్ లో ”దుర్గ” అనే టైటిల్ తో ఒక మూవీ ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా “దుర్గ “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది . ముసలి అవతారంలో భయానకంగా ఉన్న లారెన్స్ లుక్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. హారర్ థ్రిల్లర్ చిత్రాలతో భయపెట్టిన లారెన్స్ లుక్ తోటే భయపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు “దుర్గ” మూవీ గురించి లారెన్స్ ఆశ్చర్యకర అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు అన్బు , అరివు అనే ఫైట్ మాస్టర్స్ దర్శకత్వం వహిస్తున్నారనీ , తాను దర్శకత్వం వహించడం లేదనీ చెప్పారు. ఈ కవల సోదరులు తమిళ భాషలో “కబాలి’”సినిమాతో యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌గా ప్రస్థానం మొదలుపెట్టి తమిళంలోనే కాక ఇండియాలోనే టాప్ ఫైట్ మాస్టర్స్‌గా పేరు సంపాదించారు. బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “కన్నడ మూవీ కి అద్భుతంగా ఫైట్స్ కంపోజ్ చేసి నేషనల్ అవార్డ్ అందుకున్నారు. ఒక డ్యాన్స్ మాస్టర్ హీరోగా నటిస్తున్న సినిమాకు ఇలా ఇద్దరు ఫైట్ మాస్టర్లు దర్శకత్వం వహించడం విశేషమే.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























