‘7 డేస్ 6 నైట్స్’.. సంక్రాంతి బరి నుంచి ఔట్

7 Days and 6 Nights Movie out from Sankrathi Race,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates, Latest Tollywood Updates,Latest Telugu Movies News,Tollywood Movie 2022,7 Days and Nights Movie,7 Days and Nights Movie Latest Updates,7 Days and Nights Movie Update, 7 Days and Nights Movie Postponed,7 Days and 6 Nights Movie out from Sankrathi,7 Days and Nights Movie Postponed Sumanth Ashwin,Sumanth Ashwin New Movie,Sumanth Ashwin Latest Movies,Sumanth Ashwin Upcoming Movies, Kritika Shetty,Kritika Shetty New Moives,Kritika Shetty Upcoming Movies,Kritika Shetty Latest Movie

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సినిమా రిలీజ్ లు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా వరకు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండగా రిలీజ్ డేట్ లను వాయిదా వేసుకున్నాయి. ఆ లిస్ట్ లో ఇప్పుడు 7 డేస్ 6 నైట్స్ ఈసినిమా కూడా చేరిపోయింది. మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించిన నిర్మాత ఎం.ఎస్ రాజు. ఆ తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఎం. ఎస్. రాజు ‘డర్టీ హరి’ లాంటి సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇక ఆసినిమా ఇచ్చిన జోష్ తో ఒక న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈసినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. అయితే ఇప్పుడు సంక్రాంతి బరి నుండి ఈసినిమా కూడా తప్పుకుంది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈసినిమాలో హీరోయిన్ గా మెహర్ చావల్ నటిస్తుంది. వీరితో పాటు రోహన్, కృతికా శెట్టి మరో జంటగా పరిచయమవుతున్నారు. ఈసినిమాను వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ లో సుమంత్ అశ్విన్, వింటేజ్ పిక్చర్స్ మరియుఏబిజి క్రియేషన్స్ బ్యానర్స్ పై రజనీకాంత్.ఎస్ తో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈసినిమాకు సమర్థ్‌ గొల్లపూడి సంగీతం అందిస్తుండగా నాని చమిడి శెట్టి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − two =