వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో ప్రభాస్ క్లాప్ తో షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న “ప్రాజెక్ట్ K ” మూవీ షూటింగ్ లో అమితాబ్ 5 రోజుల పాటు పాల్గొని ఒక చిన్న షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు. తరువాత హీరో ప్రభాస్ , దీపిక పాల్గొన్న షూటింగ్ షెడ్యూల్ జరిగిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో ప్రభాస్ , “ప్రాజెక్ట్ K ” మూవీ పై సీనియర్ నిర్మాత అశ్వినీదత్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం హాలీవుడ్ దర్శకులంతా ఆరా తీస్తున్న ఏకైక ఇండియా హీరో ప్రభాస్ అనీ , “ప్రాజెక్ట్ K ” మూవీ తరువాత ప్రభాస్ కేవలం హాలీవుడ్ చిత్రాలు మాత్రమే చేసినా ఆశ్చర్యపోనవసరం లేదనీ , అంతర్జాతీయ స్థాయిలో “ప్రాజెక్ట్ K ” మూవీ అంతటి ప్రభావం చూపబోతోందని అశ్వినీ దత్ అన్నారు.ఈ మూవీ లో హీరో ప్రభాస్ సూపర్ హీరో గా కనిపించనున్నారని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: