పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ”రాధేశ్యామ్ “సంక్రాంతి కి విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. “ఆదిపురుష్ “మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన ప్రభాస్ ప్రస్తుతం “సలార్ “, “ప్రాజెక్ట్ K ” మూవీస్ లో నటిస్తున్నారు. “అర్జున్ రెడ్డి ” మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న “స్పిరిట్ ” మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ “బాహుబలి “, “బాహుబలి 2” మూవీస్ తో హీరో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. స్టైలిష్ మూవీ “సాహో “తో ప్రభాస్ బాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారారు. దేశ, విదేశాలలో ప్రభాస్ షూటింగ్ ఎక్కడ జరిగినా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ప్రభాస్ తో ‘రాధేశ్యామ్’ సినిమాను విదేశాల్లో తీయడం చాలా కష్టమైందని ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర అన్నారు. తాజా ఇంటర్వ్యూలో రవీంద్ర మాట్లాడుతూ… “రాధేశ్యామ్” సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామనీ , ఎక్కడ ఏ సెట్ అయినా పూర్తిగా తయారైన తరువాతనే ఓకే చెప్పడం జరిగిందనీ , ఇటలీతో పాటు ఇతర దేశాలకి వెళ్లినప్పుడు ప్రభాస్ హ్యాట్ , స్పెట్స్ పెట్టేసి సాధ్యమైనంత వరకూ ఎవరూ గుర్తుపట్టకుండా చేసేవాళ్లమనీ , హైద్రాబాద్ , ముంబైలోనే కాదు ఎక్కడో దేశంకాని దేశంలో మారుమూల ప్రాంతానికి వెళ్లినా కూడా ప్రభాస్ ని అభిమానులు వదల్లేదంటే మేము ఆశ్చర్యపోయామనీ , ఇటలీలో అయితే తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువగా ఉంటుందనీ , అక్కడైతే హాయిగా షూటింగ్ చేసుకోవచ్చునని ప్రభాస్అనుకున్నారు కానీ అక్కడికి వెళ్లిన తరువాతనే అసలు సంగతి అర్థమైందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: