
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 217


"అఖండ" పాన్ వరల్డ్ మూవీ -బాలకృష్ణ

ఈ లుక్ ఎలా ఉంది ?-రష్మిక

రాంబో లుక్ లో హీరో రామ్ చరణ్

కృతి శెట్టికి మెగా ఆఫర్

ఈ రోజు సాయంత్రం "రౌడీ బాయ్స్ "మ్యూజికల్ ఈవెంట్

మాల్దీవ్స్ లో "అంటే .. సుందరానికీ !" షూటింగ్

రవితేజ 'రావణాసుర' లో అక్కినేని హీరో

కరోనా బారిన పడ్డ 'కీర్తి సురేష్'

"తీస్ మార్ ఖాన్ "మూవీ డబ్బింగ్ ప్రారంభం

"రాధేశ్యామ్" వర్కింగ్ స్టిల్స్ రిలీజ్

సుకుమార్ మనసులో మాట

'రంగమార్తాండ' బ్రహ్మీ నెవర్ బిఫోర్ పెర్ఫామెన్స్

ఫిమేల్ సెంట్రిక్ మూవీ లో రష్మిక ?

"శ్యామ్ సింగ రాయ్" అద్భుతమైన చిత్రం -రామ్ చరణ్

న్యూ లుక్ లో ఎన్టీఆర్

'భీమ్లా నాయక్' మేకర్స్ తో వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా..!
మెగా కాంపౌండ్ నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తమ మార్క్ ను చూపించాడు వైష్ణవ్ తేజ్. నిజానికి మెగా కాంపౌండ్ నుండి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చి ఇండస్ట్రీలో తమ కంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అయితే అంత పోటీ వాతావరణంలో కూడా మొదటి సినిమాతోనే తన కుంటూ స్పెషల్ గుర్తింపును తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ అందులో సక్సెస్ అయ్యాడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమా తరువాత కొండపొలం సినిమా చేయగా ఆ సినిమాకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఇక వైష్ణవ్ తేజ్ కూడా ఎలాంటి హడావుడి లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.

"అఖండ" పాన్ వరల్డ్ మూవీ -బాలకృష్ణ
హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు క్యారెక్టర్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో “అఖండ ” మూవీ దూసుకుపోతోంది.బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రం గా "అఖండ "మూవీ నిలిచింది.

కేరళ టెంపుల్ లో "సామీ ..సామీ"
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతూ 300కోట్ల క్లబ్ లో చేరింది. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకుంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన సాంగ్స్ కు…

విశాల్ "లాఠీ"మూవీ లో 300 ఫైటర్స్ తో భారీ యాక్షన్ సీన్
పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న యాక్షన్ చిత్ర హీరో విశాల్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో విశాల్ కు తమిళ అభిమానులతో పాటు తెలుగు అభిమానులు కూడా అధికమే. హీరో విశాల్ ప్రస్తుతం "వీరమే వాగై సూడుం "(సామాన్యుడు ), "తుప్పరివాలన్ 2(డిటెక్టివ్ 2), "విశాల్ 34 ", మార్క్ ఆంటోని " మూవీస్ లో నటిస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై పలు చిత్రాలను నిర్మిస్తున్న విశాల్ "తుప్పరివాలన్ 2(డిటెక్టివ్ 2) మూవీ తో దర్శకుడిగా మారారు.

ఈ లుక్ ఎలా ఉంది ?-రష్మిక
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రష్మిక మందన్న తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ” 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. రష్మిక ప్రస్తుతం శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” , బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ స్ లో కథానాయికగా నటిస్తున్నారు.“పుష్ప :ది రైజ్ ” మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రష్మిక ఇప్పుడు ఒక ఫిమేల్ సెంట్రిక్ మూవీ కి గ్రీన్…

రాంబో లుక్ లో హీరో రామ్ చరణ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ను తెరకెక్కించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "వినయ విధేయ రామ " మూవీ ఊహించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. బోయపాటి , రామ్ చరణ్ ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ లో రామ్ చరణ్ ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి , తన డైలాగ్ డెలివరీ తో ప్రేక్షకులను అలరించారు. పవన్ , కియారా ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కృతి శెట్టికి మెగా ఆఫర్
బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి శెట్టి ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. 2021 సంవత్సరం లో కృతి శెట్టి “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” మూవీస్ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. కృతి శెట్టి ప్రస్తుతం “#RAPO 19 “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”, “బంగార్రాజు “, “మాచర్ల నియోజకవర్గం”మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

ఈ రోజు సాయంత్రం "రౌడీ బాయ్స్ "మ్యూజికల్ ఈవెంట్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “హుషారు” మూవీ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన యూత్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ “రౌడీ బాయ్స్” మూవీ జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. సాహిదేవ్ విక్రమ్ , కార్తీక్ రత్నం , కోమలి ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , టైటిల్ సాంగ్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

"రామారావు ఆన్ డ్యూటీ " లో అన్వేషి జైన్ స్పెషల్ సాంగ్
సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వాస్తవ సంఘటనలతో హై వోల్టేజ్ సోషల్ డ్రామా గా తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ ” , మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , “పెళ్ళిసందD “మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ ” ధమాకా ” మూవీ సెట్స్ పైన ఉన్నాయి. రవితేజ హీరోగా "రావణాసుర ", "టైగర్ నాగేశ్వరరావు " మూవీస్ అనౌన్స్ అయ్యాయి.

మాల్దీవ్స్ లో "అంటే .. సుందరానికీ !" షూటింగ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ రెండు షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో హీరో నాని కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ పేరుతో నటించడం విశేషం.

రవితేజ 'రావణాసుర' లో అక్కినేని హీరో
ఈమధ్య హీరోలు కూడా తమ పంథాను మార్చేశారు. అన్ని రకాలుగా ప్రయోగాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. అంతేకాదు విలన్ పాత్రలకు పెరుగుతున్న క్రేజ్ ను చూసి నెగెటివ్ షేడ్ లో కూడా కనిపించడానికి అస్సలు వెనుకాడట్లేదు. అంతేకాదు పాత్ర నచ్చితే వేరే సినిమాల్లో కూడా చేసేస్తున్నారు. అలా చేసే వారిలో అక్కినేని హీరో సుశాంత్ కూడా ఉన్నాడు. అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన సుశాంత్ కు సక్సెస్ రేటు కాస్త తక్కువే అని చెప్పొచ్చు. చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అందుకే చాలా కాలం సినిమాలకు దూరంగా కూడా ఉన్నారు. అయితే ఆమధ్య వచ్చిన 'చి.ల.సౌ' సినిమాతో ఒక డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఆతర్వాత అల వైకుంఠపురములో…

కరోనా బారిన పడ్డ 'కీర్తి సురేష్'
కరోనా బారిన పడుతున్న సెలబ్రిటీల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. మహేష్ బాబు, మంచు లక్ష్మీ, థమన్, వరలక్ష్మీ శరత్ కుమార్, సత్యరాజ్, హెబ్బా పటేల్, బండ్ల గణేష్, త్రిష, ఇషా చావ్లా, రేణుదేశాయ్, లతా మంగేష్కర్, ఖుష్బూ … ఇలా చాలా మంది కరోనా బారిన పడ్డారు. సెలబ్రిటీల్లో వరుస కరోనా కేసులు పెరుగుతుండటంతో సినీ పరిశ్రమ వర్గాల్లో ఆందోళన మొదలయింది. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తనకు కరోనా అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

"తీస్ మార్ ఖాన్ "మూవీ డబ్బింగ్ ప్రారంభం
యంగ్ హీరో ఆది సాయికుమార్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. ఆది సాయికుమార్ కథానాయకుడిగా “జంగిల్ “, “కిరాతక “, “అమరన్” , "బ్లాక్" మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. విజన్ సినిమాస్ బ్యానర్ పై కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఆది సాయి కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ “తీస్ మార్ ఖాన్ ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. పాయల్ రాజ్ పుత్ కథానాయిక. సునీల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

"రాధేశ్యామ్" వర్కింగ్ స్టిల్స్ రిలీజ్
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్“మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ…

సుకుమార్ మనసులో మాట
బ్లాక్ బస్టర్ "ఆర్య "(2004 ) మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన సుకుమార్ "ఆర్య 2", 100%లవ్ ", "నాన్నకు ప్రేమతో "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత జంటగా తెరకెక్కిన "రంగస్థలం "మూవీ ఘనవిజయం సాధించి 200కోట్ల క్లబ్ లో చేరింది. సుకుమార్ , అల్లు అర్జున్ హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన "పుష్ప :ది రైజ్"మూవీ ప్రపంచవ్యాప్తం గా 300కోట్లు కలెక్ట్ చేసి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సుకుమార్ రైటింగ్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి సుకుమార్ తన అసిస్టెంట్స్ ను దర్శకులు గా టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నారు.

'రంగమార్తాండ' బ్రహ్మీ నెవర్ బిఫోర్ పెర్ఫామెన్స్
కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా రంగమార్తాండ. నానా పటేకర్ హీరోగా నటించిన ‘నట సామ్రాట్’ సినిమాకు ఈ సినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో బ్రహ్మానందం కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా స్టార్ట్ చేసిన షెడ్యూల్ లో బ్రహ్మీ కూడా పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్, బ్రహ్మీ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ కృష్ణ వంశీ కూడా తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ.. నట రాక్షసుడు ప్రకాష్ రాజ్, పద్మశ్రీ బ్రహ్మానందం గారితో ఒక పవర్ ఫుల్ సీన్ ఇప్పుడే షూట్ జరిగింది.. ఇంత వరకూ ఎప్పుడూ…

ఫిమేల్ సెంట్రిక్ మూవీ లో రష్మిక ?
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రష్మిక మందన్న తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ” 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. రష్మిక ప్రస్తుతం శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” , బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ స్ లో కథానాయికగా నటిస్తున్నారు.

"శ్యామ్ సింగ రాయ్" అద్భుతమైన చిత్రం -రామ్ చరణ్
హారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 24న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తో , తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్ సీస్ లో భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. రెండు విభిన్నమైన పాత్రలలో నాని , దేవదాసి పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

'పుష్ప' రాజ్ కు ఫిదా అవుతున్న బాలీవుడ్ సెలబ్రిటీలు
బన్నీ-సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా పుష్ప సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో చూస్తున్నాం పాన్ ఇండియా సినిమాగా మొదటి సారి వచ్చినా కూడా పుష్ప టీం తన ఇంపాక్ట్ ను అయితే బాక్సాఫీస్ వద్ద బాగానే చూపిస్తుంది. ప్రస్తుతం కాస్త పరిస్థితులు బాలేకపోయినా కూడా పుష్ప సినిమా మాత్రం ప్రభంజనం సృష్టిస్తుంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. అంతేకాదు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈసినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్, కరణ్ జోహార్, అర్జున్ కపూర్ ఇంకా చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా బన్నీపై ప్రశంసలు కురిపించారు. ఇక తాజాగా డైరెక్టర్…

న్యూ లుక్ లో ఎన్టీఆర్
“నిన్ను చూడాలని “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ “స్టూడెంట్ నెం 1” తో కమర్షియల్ హీరోగా మారారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఎన్టీఆర్ తనదైన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం”మూవీ జనవరి 7వ తేదీ రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న “#NTR30” మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.