ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా రూపొందిన సినిమా ‘కె.జి.యఫ్ ఛాప్టర్ 2’. ఈసినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా కన్నడ చిత్ర పరిశ్రమకు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. ఇక పార్ట్ వన్ ఇచ్చిన ఎనర్టీతో ఇప్పుడు ఛాప్టర్ 2 వస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఈసినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో కూడా తెలుసు. మరి ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ తెలిసిందే కదా కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా ఈఏడాది ఏప్రిల్ 14న ప్రపంచం వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కోబోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా.. ఆమధ్య సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ.. ఈసినిమాలో నటిస్తున్న కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేస్తూ మంచి హైప్ క్రియేట్ చేసేవాళ్లు చిత్రబృందం. కానీ గత కొద్ది రోజులుగా మేకర్స్ కూడా సైలెంట్ అయిపోయారు. ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి చాలా రోజులే అయింది. అయితే ఇప్పుడు యష్ పుట్టినరోజు సందర్బంగా ఈసినిమా నుండి యష్ కు సంబంధించిన పవర్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ తో మరోసారి కె.జి.యఫ్ 2 హాట్ టాపిక్ అయింది.
Caution⚠️ Danger ahead !
Birthday wishes to our ROCKY BHAI @Thenameisyash.#KGFChapter2 @prashanth_neel @VKiragandur @HombaleGroup @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @VaaraahiCC @excelmovies@AAFilmsIndia @DreamWarriorpic @PrithvirajProd #KGF2onApr14 #HBDRockingStarYash pic.twitter.com/TVeHXcsCzx— Hombale Films (@hombalefilms) January 8, 2022
కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ చిత్రంలో అధీర అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. రవీనాటాండన్‌లతో పాటు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, ఇంకా రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబలే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం .. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: