నువ్వు ఎప్పటికీ నా అన్నయ్యవే.. మహేష్ ఎమోషనల్..!

Mahesh Babu Gets Emotional About His Brother,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates, Latest Tollywood Updates,Latest Telugu Movies News,Tollywood Movie 2022,Mahesh Babu,Mahesh Babu Brother,Mahesh Babu under home isolation, Mahesh Babu Tested Postive For COVID-19,Mahesh Babu Penned an Emotional Note For his Brother Ramesh Babu,Mahesh Babu Brother Ramesh Babu, Mahesh Babu Shared a Pic of His Brother Ramesh,Mahesh Babu Share Pic of his Brother In Social Media,Mahesh Babu tested positive for COVID-19, Mahesh babu Emotional Note,Mahesh Babu Latest Movies,Mahesh Babu Upcoming Movies,Mahesh Babu Latest News,Ramesh Babu Passes Away, Mahesh Babu's Elder Brother Ramesh Babu Passes Away,Chiranjeevi,Rakul Preet Singh,Manchu Vishnu,Super Star Krishna,Tollywood Celebrity Offers Condolences, Jubilee Hills Vaikunta Mahaprasthanam,Ramesh Babu last Rites at Mahaprasthanam

సినీ పరిశ్రమకు ఒక దాని తర్వాత మరో దెబ్బ తగులుతూనే ఉంది. గత రెండేళ్లలోనే ఎంతో మంది సినీ ప్రముఖులను సినీ పరిశ్రమ కోల్పోయింది. కరోనా వల్ల ఎంతో మంది లెజెండరీలను కోల్పోవాల్సి వచ్చింది. కొంతమంది అకాల మరణం చెందారు. ఇక ప్రస్తుతం కరోనా వల్ల రోజుకో సెలబ్రిటీ కరోనా బారిన పడుతున్నారు. ఈనేపథ్యంలో మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మరణించిన వార్త ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు రమేష్ బాబు. అది కాస్త సీరియస్ అవ్వగా ఆస్పత్రికి
తరలించే క్రమంలో తుదిశ్వాస విడిచారు. ఇక రమేష్ బాబు మరణంతో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ శోక సముద్రంలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక కృష్ణ కుటుంబానికి అందరూ సంతాపం తెలియచేస్తున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరిగాయి. కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. కాగా ఇప్పటికే కృష్ణ విజయ నిర్మల మరణంతో కుదేలవ్వగా.. ఇప్పుడు కొడుకు మరణంతో మరింత బలహీనపడిపోయారు.

మరోవైపు మహేష్ బాబుకు కరోనా రావడంతో రమేష్ ను చూడటానికి రాలేకపోయారు. అయితే
అన్నయ్య మరణంతో మహేష్ బాబు తీవ్ర భావోద్వేగానికి గురవుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘నువ్వు నాకొక స్పూర్తి.. నా బలం.. నా ధైర్యం.. అన్నీ నువ్వే.. నువ్వు లేకపోయి ఉంటే ఇవాళ నేననే వ్యక్తిని సగం మాత్రమే.. నువ్వు నాకోసం చేసినవాటికి కృతజ్ఞతలు.. ఇప్పుడిక విశ్రాంతి… విశ్రాంతి.. ఈ జీవితమే కాదు, మరో జన్మంటూ ఉంటే నువ్వు ఎప్పటికీ నా అన్నయ్య.. నిన్ను ఇప్పుడు, ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను…’ అంటూ మహేష్ తన ట్వీట్‌లో ఎమోషనల్ అయ్యారు.

కాగా సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు రమేష్ బాబు. బాలనటుడిగా కొన్ని, హీరోగా కొన్ని సినిమాలు చేశారు. తండ్రి కృష్ణతో ‘కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు, ఆయుధం, ఎన్‌కౌంటర్‌’చిత్రాల్లో కలిసి నటించగా.. తమ్ముడు మహేష్ తో ‘బజారు రౌడీ, ‘ముగ్గురు కొడుకులు’చిత్రాల్లో నటించారు. 1997లో వచ్చిన ‘ఎన్‌కౌంటర్‌’రమేష్ బాబు చివరి చిత్రం. ఆ తర్వాత 1999లో వచ్చిన హిందీ చిత్రం ‘సూర్యవంశమ్‌’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా చేశారు. ‘ఎన్‌కౌంటర్’ సినిమా తర్వాత మళ్లీ తెరపై కనిపించని రమేష్ బాబు కృష్ణ ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మాతగా మారి సోదరుడు మహేష్‌తో అర్జున్, అతిథి చిత్రాలు నిర్మించారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here