మనం లాంటి క్లాసిక్ సినిమా తరువాత మరోసారి వెండితెర పై సందడి చేయడానికి వస్తున్నారు కింగ్ నాగార్జున తనయుడు నాగచైతన్య. ఈసారి బంగార్రాజు సినిమాతో వచ్చేస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు వస్తున్న సీక్వెల్ ఇది. ఇప్పటికే ఈసినిమా నుండి ఏ అప్ డేట్ వచ్చినా అవి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగుతుంది ఈసినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో ఒస స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ దక్ష కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలో తాజాాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దక్ష ఈపాట చేయడానికి ముందు నేను చాలా ఆలోచించాను.. మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి.. ఈ టైమ్ లో ఇలాంటి స్పెషల్ సాంగ్స్ లో చేయోద్దని నా సన్నిహితులు కూడా వద్దన్నారు.. కానీ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తో మాట్లాడి.. ఆయన ఈ పాట గురించి వివరించగా వెంటనే ఓకే చెప్పేశా అని తెలిపింది. ఇది గ్రాండ్ ఫెస్టివల్ సాంగ్.. సంక్రాంతి పండక్కి సరైన కలర్ ఫుల్ సాంగ్.. ఆడియన్స్ కు తప్పకుండా ఆసాంగ్ నచ్చుతుంది. నాగచైతన్య నాఫస్ట్ డ్యాన్స్ కో స్టార్.. నేను కొన్ని స్టెప్స్ రిహార్సల్స్ చేస్తున్నప్పుడు కూడా చై చాలా ఓపికగా వెయిట్ చేసేవాడు అంటూ దక్ష తన వర్క్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పుకొచ్చింది.
కాగా హుషారు, జాంబిరెడ్డి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను దగ్గరైంది దక్ష. వీటిలో జాంబిరెడ్డి సినిమా మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం పలు అవకాశాలను దక్కించుకుంటుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, కన్నడలో కూడా సినిమాలు చేస్తుంది ఈభామ.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: