మెగా కాంపౌండ్ నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తమ మార్క్ ను చూపించాడు వైష్ణవ్ తేజ్. నిజానికి మెగా కాంపౌండ్ నుండి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చి ఇండస్ట్రీలో తమ కంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అయితే అంత పోటీ వాతావరణంలో కూడా మొదటి సినిమాతోనే తన కుంటూ స్పెషల్ గుర్తింపును తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ అందులో సక్సెస్ అయ్యాడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమా తరువాత కొండపొలం సినిమా చేయగా ఆ సినిమాకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఇక వైష్ణవ్ తేజ్ కూడా ఎలాంటి హడావుడి లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు వైష్ణవ్ తేజ్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. భీమ్లానాయక్ మేకర్స్ తో వైష్ణవ్ తేజ్ సినిమా ఛాన్స్ ను కొట్టేశాడు. ఈ మేరకు చిత్రనిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు అధికారికంగా ప్రకటించారు. తమ బ్యానర్ లో వస్తున్న 16వ సినిమా అని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ తో కలిసి ఈసినిమాను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈసినిమాకు సంబంధించిన వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.
We are delighted to announce our #ProductionNo16 in association with @Fortune4Cinemas 💥
Await a MASS TREAT from #PanjaVaisshnavTej ⚡🤩#HBDPanjaVaisshnavTej 🥳@vamsi84 #SaiSoujanya pic.twitter.com/spL7ceM0NB
— Sithara Entertainments (@SitharaEnts) January 13, 2022
కాగా ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఉప్పెన సినిమాకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: