ఈమధ్య హీరోలు కూడా తమ పంథాను మార్చేశారు. అన్ని రకాలుగా ప్రయోగాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. అంతేకాదు విలన్ పాత్రలకు పెరుగుతున్న క్రేజ్ ను చూసి నెగెటివ్ షేడ్ లో కూడా కనిపించడానికి అస్సలు వెనుకాడట్లేదు. అంతేకాదు పాత్ర నచ్చితే వేరే సినిమాల్లో కూడా చేసేస్తున్నారు. అలా చేసే వారిలో అక్కినేని హీరో సుశాంత్ కూడా ఉన్నాడు. అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన సుశాంత్ కు సక్సెస్ రేటు కాస్త తక్కువే అని చెప్పొచ్చు. చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అందుకే చాలా కాలం సినిమాలకు దూరంగా కూడా ఉన్నారు. అయితే ఆమధ్య వచ్చిన ‘చి.ల.సౌ’ సినిమాతో ఒక డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఆతర్వాత అల వైకుంఠపురములో సినిమాలో ఓ కీలక పాత్రలో కూడా నటించాడు. ఇక ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క ఏదైనా మంచి పాత్ర వస్తే చేసుకుంటూ వెళుతున్నాడు సుశాంత్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రలో నటించే ఛాన్స్ ను కొట్టేశాడు సుశాంత్. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా రావణాసుర. ఈసినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు కూడా. అయితే ఈసినిమాలో సుశాంత్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. సుశాంత్ ‘రామ్’ అనే క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. పొడవాటి జుట్టు, గెడ్డంతో సరికొత్త గెటప్‌లో సుశాంత్ లుక్ ఆకట్టుకుంటోంది.
From the World of DEMONS 👺
Introducing & Welcoming @iamSushanthA On Board as #RAM🤘🏻
Here’s #RAMFirstLook 😎#𝗥𝗔𝗩𝗔𝗡𝗔𝗦𝗨𝗥𝗔 🔥 pic.twitter.com/WSURq2PC12
— ABHISHEK PICTURES (@AbhishekPicture) January 11, 2022
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: