“నిన్ను చూడాలని “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ “స్టూడెంట్ నెం 1” తో కమర్షియల్ హీరోగా మారారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఎన్టీఆర్ తనదైన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం”మూవీ జనవరి 7వ తేదీ రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న “#NTR30” మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా “#NTR30” మూవీ తెరకెక్కనుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన “జనతా గ్యారేజ్ ” మూవీ ఘనవిజయం సాధించింది.త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న“#NTR30” మూవీ కై ఎన్టీఆర్ సాఫ్ట్, కూల్ అండ్ స్టైలిష్ లుక్ లోకి మారిపోయారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొత్త లుక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: