యంగ్ హీరో ఆది సాయికుమార్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. ఆది సాయికుమార్ కథానాయకుడిగా “జంగిల్ “, “కిరాతక “, “అమరన్” , “బ్లాక్” మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. విజన్ సినిమాస్ బ్యానర్ పై కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఆది సాయి కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ “తీస్ మార్ ఖాన్ ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. పాయల్ రాజ్ పుత్ కథానాయిక. సునీల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “తీస్ మార్ ఖాన్ ” మూవీలో హీరో ఆది స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. దసరా పండగ సందర్భంగా “తీస్ మార్ ఖాన్ ” మూవీకి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.సిగరెట్ కాలుస్తూ నడుస్తూ వస్తున్నట్లు ఉన్న ఈ మాస్ లుక్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ‘తీస్‌మార్ ఖాన్’ చిత్రానికి ఆది డబ్బింగ్ ప్రారంభించారు. ఆవిషయాన్ని సోషల్ మీడియా వేదికగా హీరో ఆది వెల్లడించారు. ఈ పవర్ ఫుల్ సినిమాని థియేటర్స్‌లో చూడడానికి రెడీగా ఉండండి అంటూ నిర్మాతలు తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: