‘పుష్ప’ రాజ్ కు ఫిదా అవుతున్న బాలీవుడ్ సెలబ్రిటీలు

Bollywood Celebrities Praise Pushpa The Rise,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Tollywood Movie 2022,Bollywood Celebrities,Bollywood Celebrities Praise Pushpa,Pushpa Movie Bollywood Response,Celebrities Praise Pushpa The Rise,Pushpa Movie Celebrity Response, Pushpa Movie Bollywood Celebrity Response,Pushpa Movie Collections,Pushpa Movie Box office Collections,Director Sukumar,Sukumar Movies,Sukumar Latest Hits, Sukumar New Movies,Sukumar Sensational Hit Pushpa,Allu Arjun Acting In pushpa Movie,Allu Arjun Acting In Pushpa,Pushpa Part-1,Pushpa Part-2#PUSHPA #AlluArjun

బన్నీ-సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా పుష్ప సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో చూస్తున్నాం పాన్ ఇండియా సినిమాగా మొదటి సారి వచ్చినా కూడా పుష్ప టీం తన ఇంపాక్ట్ ను అయితే బాక్సాఫీస్ వద్ద బాగానే చూపిస్తుంది. ప్రస్తుతం కాస్త పరిస్థితులు బాలేకపోయినా కూడా పుష్ప సినిమా మాత్రం ప్రభంజనం సృష్టిస్తుంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. అంతేకాదు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈసినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్, కరణ్ జోహార్, అర్జున్ కపూర్ ఇంకా చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా బన్నీపై ప్రశంసలు కురిపించారు. ఇక తాజాగా డైరెక్టర్ కునాల్ కోహ్లీ కూడా బన్నీ యాక్టింగ్ కు ఫిదా అయిపోయాడు. తన ట్విట్టర్ ద్వారా.. పుష్ప సినిమా చూశాను.. బన్నీ వన్ మ్యాన్ షో..అవార్డ్ విన్నింగ్ పెర్ఫామెన్స్.. వాట్ ఏ ఫిలిం.. వాట్ ఏ హీరో అంటూ బన్నీపై పొగడ్తలు కురిపించారు. మరి ఈ లిస్ట్ లో ఇంకెంతమంది సెలబ్రిటీలు చేరుతారో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాకు ప్రధాన బలం సుకుమార్ కథ ఇంకా అల్లు అర్జున్ మేకోవర్, నటన. ఇంతకుముందు కూడా అల్లు అర్జున్ మాస్ పాత్రల్లో నటించాడు. కానీ ఇంత ఊరమాస్ గా అలానే డీగ్లామరస్ గా మొరటు పాత్రలో మాత్రం ఈసినిమాలో నటించాడు. పుష్పరాజ్ పాత్రకు బన్నీ తప్ప ఇంకెవరూ ఆ రేంజ్ లో చేయలేరు అన్నట్టు ఓదిగిపోయాడు. ఇక చిత్తూరు యాసలో తను చెప్పిన డైలాగ్స్ కూడా ఈసినిమాకు ప్లస్ పాయింట్ అయింది. ఇంకా దేవి శ్రీ ప్రసాద్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీక్వెన్స్ వీటితో పాటు ఈసినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ సినిమా విజయంలో తన పాత్ర పోషించారు.

మరోవైపు పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పార్ట్ 2 పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సుకుమార్ పార్ట్ 2 ఎంత ఇంట్రెస్టింగ్ గా చూపిస్తాడా అని ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. ఇంకోవైపు మేకర్స్ కు కూడా టెన్షన్ మొదలైంది. ప్రేక్షకులు నిరాశపడకూడదంటే పార్ట్ 2 అంతకుమించి ఉండాలి.. అలా ఉండాలంటే ప్రతి చిన్న విషయంలో, కథలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సుకుమార్ కాబట్టి ఆ విషయంలో నో ప్రాబ్లామ్. కానీ ప్రేక్షకులను మెప్పించాలంటే మాత్రం కత్తి మీద సాము లాంటిదే. చూద్దాం మరి ప్రస్తుతం అయితే టీమ్ పార్ట్ 2 పై ఫోకస్ పెట్టింది.. అది ఈ ఏడాదే రిలీజ్ చేస్తారా లేక వచ్చే ఏడాది అవుతుందా.. ఆ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది.. తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =