గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్“మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Hello all!! Here are some working stills of our darlings #Vikramaditya and #Prerana from #radheshyam !! Let’s all stay low to come back stronger🤗🤗 pic.twitter.com/cqiSBjsa74
— Radha Krishna Kumar (@director_radhaa) January 10, 2022
“రాధేశ్యామ్ ” మూవీ కై ఎంతో ఆసక్తి తో ఎదురు చూస్తున్న అభిమానులు విడుదల వాయిదా పడడంతో నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో అభిమానులకు ఉత్సాహం కలిగించేందుకు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ “రాధేశ్యామ్” వర్కింగ్ స్టిల్స్ ను సోషల్ మీడియా లో షేర్ చేసి అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. ప్రభాస్, పూజా హెగ్డేలపై చిత్రీకరించిన సన్నివేశాల తాలూకు ఫోటోలను షేర్ చేస్తూ “రాధేశ్యామ్” నుంచి డార్లింగ్ విక్రమాదిత్య (ప్రభాస్), ప్రేరణ (పూజా హెగ్డే)ల ఫొటోలు ఇవిగోఅనీ , మనందరం కాస్త వెనక్కి తగ్గుదామనీ , .అయితే మరింత బలంగా మళ్లీ వద్దామనీ ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: