బ్లాక్ బస్టర్ “ఆర్య “(2004 ) మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన సుకుమార్ “ఆర్య 2”, 100%లవ్ “, “నాన్నకు ప్రేమతో “వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత జంటగా తెరకెక్కిన “రంగస్థలం “మూవీ ఘనవిజయం సాధించి 200కోట్ల క్లబ్ లో చేరింది. సుకుమార్ , అల్లు అర్జున్ హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన “పుష్ప :ది రైజ్”మూవీ ప్రపంచవ్యాప్తం గా 300కోట్లు కలెక్ట్ చేసి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సుకుమార్ రైటింగ్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి సుకుమార్ తన అసిస్టెంట్స్ ను దర్శకులు గా టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు సుకుమార్ తన మనసులో మాటను వెల్లడించారు. “విక్రమ్ వేద”, “రాచ్చసన్”తమిళ మూవీస్ ను తెలుగు లో రీమేక్ చేయాలనుకున్నాననీ , ఆ రెండు మూవీస్ చూసినప్పుడు అద్భుతంగా అనిపించాయనీ , ఎవరైనా అడిగితే తెలుగు లో రీమేక్ చేయాలనిపించేలా నచ్చాయనీ , ఎవరూ అడగకపోవడంతో సైలెంట్ అయిపోయాననీ చెప్పారు. సుకుమార్ ప్రస్తుతం “పుష్ప2 “మూవీ ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: