
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 212


"అఖండ" మేకింగ్ వీడియో రిలీజ్

గోవా లో ఐసోలేషన్ లో నాగార్జున

తమిళనాడు లో "పుష్ప :ది రైజ్"మూవీ రీరిలీజ్

వెనక్కి తగ్గేదిలేదు అంటున్న 'ఖిలాడి'

"థాంక్యూ" మూవీ అప్ డేట్

"భోళా శంకర్ "మూవీ సెట్స్ కు కీర్తి సురేష్

"రావణాసుర"మూవీ సెట్స్ లో సుశాంత్

'RC 15' షూటింగ్ అప్ డేట్..!

కొత్త ఆరంభం అంటున్న 'సామ్'

కల నెరవేరింది - పూజాహెగ్డే

'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

'రంగరంగ వైభవంగా' వైష్ణవ్ తేజ్.. టైటిల్ టీజర్ రిలీజ్..!
మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఆ సినిమా తరువాత కొండపొలం సినిమాతో వచ్చాడు. ఆ సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

"అఖండ" మేకింగ్ వీడియో రిలీజ్
హీరో నందమూరి బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండుపాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఫస్ట్ టైమ్ అఘోరా పాత్రలో నటించిన బాలకృష్ణ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ప్రభాస్ సినిమాపై మారుతి క్లారిటీ.. టైమ్ వచ్చినప్పుడు అన్నీ బయటకొస్తాయి..!
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. రాధేశ్యామ్ రిలీజ్ కు సిద్దంగా ఉండగా.. ఆదిపురష్ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి..ఇంకా పట్టాలెక్కని స్పిరిట్ సినిమా లైన్ లో ఉంది.

'అల వైకుంఠపురములో'.. హిందీ డబ్బింగ్ రిలీజ్ లో ట్విస్ట్
సుకుమార్- బన్నీ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా పుష్ప ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందే తెలిసిందే కదా. మొదటిసారి పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బన్నీ మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు. మన తెలుగు ప్రేక్షకులకు బన్నీ సినిమాలు ఎలా ఉంటాయో తెలుసు. ఇక పుష్పతో నార్త్ లో కూడా తన సత్తాను చాటాడు. ఇక ఇప్పుడు అదే క్రేజ్ ను క్యాచ్ చేసుకోవాలని చూస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. ఈనేపథ్యంలో బన్నీ అల వైకుంఠపురములో సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నారు. నిజానికి ఈసినిమా రీమేక్ కూడా వస్తుంది బాలీవుడ్ లో. కానీ ముందే డబ్బింగ్ చేసి ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు.

హ్యాపీ బర్త్ డే నమ్రత-నా ప్రపంచాన్ని పంచుకున్నందుకు థ్యాంక్స్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు ఫ్యామిలీ పరంగా కానీ.. ఇటు కెరీర్ పరంగా కానీ మహేష్ సూపర్ సక్సెస్ లో ఉన్నాడంటే ఆ సక్సెస్ వెనుక నమ్రత కూడా ఉందన్న సంగతి ఒప్పుకోవాల్సిందే. ఇక నేడు నమ్రత తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా మహేష్ నమ్రతకు తన ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ అందించారు. హ్యాపీ బర్త్ డే నమ్రత.. నా ప్రపంచాన్ని నాతో పంచుకున్నందుకు నీకు థ్యాంక్స్ అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు మహేష్.

గోవా లో ఐసోలేషన్ లో నాగార్జున
కరోనా ఎఫెక్ట్ తో పాన్ ఇండియా మూవీస్ సంక్రాంతి రేస్ నుండి తప్పుకుంటే సంక్రాంతికి నాగార్జున తన తనయుడి తో కలసి నటించిన"బంగార్రాజు " మూవీ రిలీజ్ చేశారు. సంక్రాంతి అంటేనే ఫ్యామిలీతో సహా ఆడియెన్స్ ను థియేటర్స్ కి తీసుకొచ్చే పండుగ. అందుకే ఉన్న ఒక్క ఆప్షన్ ను వదులుకోలేక "బంగార్రాజు" మూవీ ని ప్రేక్షకులు ఆదరించారు. నాగార్జున , నాగచైతన్య తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

తమిళనాడు లో "పుష్ప :ది రైజ్"మూవీ రీరిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా సుమారు 300కోట్లు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. తెలుగు ,తమిళ , కన్నడ , మలయాళ భాషల ప్రేక్షకులు "పుష్ప " మూవీ కి బ్రహ్మరథం పడుతున్నారు.

వెనక్కి తగ్గేదిలేదు అంటున్న 'ఖిలాడి'
రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఖిలాడి. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పుడో మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను, పాటలను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. ఇక ఈసినిమా రిలీజ్ పై కూడా గత కొద్దరోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు బాలేదు కాబట్టి ఈ సినిమా రిలీజ్ కూడా వాయిదా పడుతుందేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఈ అనుమానాలకు బ్రేక్ వేశారు మేకర్స్. ఈ సినిమాను చెప్పిన డేట్ కే రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 11న విడుదల చేస్తున్నట్టు…

"థాంక్యూ" మూవీ అప్ డేట్
నాగ చైతన్య హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సింక్ సౌండ్ టెక్నాలజీ తో “థ్యాంక్యూ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో అందాల రాశీ ఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం , పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

"భోళా శంకర్ "మూవీ సెట్స్ కు కీర్తి సురేష్
ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , తమన్నా జంటగా అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో “భోళా శంకర్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “వేదాళం”తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. చిరంజీవికి కీర్తీ సురేశ్ రాఖీ కడుతున్న ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మెగా స్టార్ చిరంజీవి , కీర్తి సురేష్ ల వీడియో క్లిప్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.“భోళా శంకర్”మూవీ లోని తన పాత్ర కోసం చిరంజీవి పూర్తి డిఫరెంట్ మేకోవర్‌తో కనిపించబోతున్నారు.

"రావణాసుర"మూవీ సెట్స్ లో సుశాంత్
అభిషేక్ పిక్చర్స్ , ఆర్ టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రావణాసుర” మూవీ సంక్రాంతి సందర్బంగా జనవరి 14న లాంచనంగా ప్రారంభం అయ్యింది. రవితేజ పది డిఫరెంట్ గెటప్ లలో కనిపించి సర్ ప్రైజ్ చేయబోతున్న ఈ మూవీ లో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ , దక్ష నగార్కర్ కథానాయికలు. హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ కి హర్షవర్ధన్ రామేశ్వర్ , భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, సంక్రాంతి పండగ రోజున చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ అయిన పోస్టర్…

'RC 15' షూటింగ్ అప్ డేట్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్నాడు. ఇప్పటికే తన రెండు సినిమాలను రిలీజ్ కు సిద్దం చేశాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండగా అది వాయిదా పడింది. తాజాగా ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ సినిమాను మార్చి 18, 2022న విడుదల చేయనున్నామని ప్రకటించారు. అప్పటికీ పరిస్థితులు నార్మల్ గా లేకపోతే ఏప్రిల్ 28నే ఈసినిమాను రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇక మరోవైపు ఆచార్య సినిమా కూడా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఏప్రిల్ 1న ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. మరి ఆరోజే రిలీజ్ అవుతుందా లేక మళ్లీ…

కొత్త ఆరంభం అంటున్న 'సామ్'
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి సమంత. తన సినిమాలతో.. తన పాత్రలతో ఎంతో మందిని మెప్పించింది. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాదు హోస్ట్, బిజినెస్ రంగంలోనూ, వెబ్ సిరీస్ లు, సేవా కార్యక్రమాలు ఇలా అన్నింటిలో తన మార్క్ చూపిస్తూ ఆల్ రౌండర్ పేరు తెచ్చుకుంది. ఇక సామ్ కూడా ఏదో ఒక వార్త ద్వారా సోషల్ మీడియాలో ఎప్పుడూ టాక్ ఆప్ ద టౌన్ గానే ఉంటుందన్న సంగతి తెలిసిందే. అప్పట్లో సినిమాలు, ఇంకా వ్యక్తి గత జీవితం గురించి పలు వార్తలు వచ్చేవి.. ఇప్పుడు చైతుతో డివోర్స్ అయిన తరువాత ఎక్కువగా దానికి సంబంధించిన వార్తలే వస్తున్నాయి.

నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య విభిన్న కథా చిత్రాలలో డిఫరెంట్ రోల్స్‌ను పోషిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. రీసెంట్ గా వరుడు కావలెను, లక్ష్య సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నాగశౌర్య ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ లను పూర్తిచేసే పనిలో పడ్డాడు. నాగ శౌర్య లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో అనీష్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమా కూడా ఉంది. అనీష్ కృష్ణ ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.

టాలీవుడ్ పై అనన్య పాండే ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
ప్రస్తుతం టాలీవుడ్ సినిమా మార్కెట్ రేంజ్ పెరిగిపోయింది అని చెప్పొచ్చు. మన వాళ్లు భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి అస్సలు వెనుకాడటంలేదు. స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ నుండి సినిమా వస్తుందంటే చాలు పాన్ ఇండియా సినిమానే అవుతుంది. సినిమా హిట్ అయినా ఫట్ అయినా నిర్మాతలు కూడా ఏ మాత్రం రాజీ పడకుండా ధైర్యంగా సినిమాలు తీస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమాలను నార్త్ లో ఇప్పుడు ఆదరించినంత ఉండేది కాదు.. కానీ బాహుబలి తో తెలుగు సినిమా మార్కెట్ పూర్తిగా మారిపోయింది. ఆ తరువాత సాహో సినిమా.. ఇక గత రెండు మూడేళ్లలో ఎన్నో సినిమాలు.. ఇక రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమా తెలుగు సినిమా సత్తాను నార్త్ బాక్సాఫీస్ వద్ద…

కల నెరవేరింది - పూజాహెగ్డే
టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజాహెగ్డే , స్టార్ హీరో విజయ్ జంటగా తెరకెక్కిన “బీస్ట్ ” తమిళ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. “#SSMB28” , “#PSPK 28” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

"పుష్ప" శ్రీవల్లి సాంగ్ కు క్రికెటర్ డేవిడ్ వార్నర్ డ్యాన్స్
పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించాయి. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సాంగ్ “ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా” కు డ్యాన్స్ చేసి, ఆ వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేయగా ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. వార్నర్ బ్రదర్.. తగ్గేదే లే..’ అంటూ అల్లు అర్జున్ కామెంట్ చేశారు.

'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటని చెప్పొచ్చు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-చరణ్ ప్రధాన పాత్రల్లో ఈ క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కింది. మూడేళ్లుగా ఈసినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఎన్నో రిలీజ్ డేట్ లు మారాయి. ఇక ఫైనల్ గా ఈ ఏడాది సంక్రాంతికి ఈసినిమా విడుదల అవుతుందని అందరూ వేయి కళ్లతో ఎదురుచూశారు. కానీ కరోనా థర్డ్ వేవ్ వల్ల మళ్లీ రిలీజ్ కు బ్రేక్ పడింది. థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గడం.. దానికి తోడు కొన్ని చోట్ల థియేటర్లు కూడా మూత పడటంతో రిలీజ్ ను వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తామని ప్రకటించలేదు. కేవలం సరైన సమయం చూసుకొని విడుదల…

డిస్నీ హాట్ స్టార్ లోకి వచ్చేసిన 'అఖండ'
గత ఏడాది చివరిలో రిలీజ్ అయిన సినిమాల్లో అఖండ, పుష్ప సినిమాలు కాస్త పెద్ద సినిమాలు అని చెప్పొచ్చు. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాయి. వీటిలో పాన్ ఇండియా సినిమాగా వచ్చిన పుష్ప అటు తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లో కూడా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇక అఖండ సినిమా కూడా మాములు హిట్ కాదు బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈసినిమాతో అటు బాలకృష్ణ-బోయపాటి కూడా హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పటికే సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకొని ఇంకా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ ఉంది. తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఓవర్‌సీస్‌లో కూడా భారీ వసూళ్లను రాబట్టిందీ సినిమా. ఇటీవలి కాలంలో 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమాగా…

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సమ్మోహనం సినిమా హిట్ అయిన సంగతి తెలిసిందే కదా. ఆ సినిమాతో వీరిద్దరూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాతో వస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా .. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.