టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య విభిన్న కథా చిత్రాలలో డిఫరెంట్ రోల్స్‌ను పోషిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. రీసెంట్ గా వరుడు కావలెను, లక్ష్య సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నాగశౌర్య ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ లను పూర్తిచేసే పనిలో పడ్డాడు. నాగ శౌర్య లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో అనీష్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమా కూడా ఉంది. అనీష్ కృష్ణ ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా నేడు నాగ శౌర్య పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. కృష్ణ వ్రింద విహారి అనే డిఫరెంట్ టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేయగా.. ఇక ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్‌లో నాగ శౌర్య నిలువు బొట్టుతో బ్రాహ్మణుడిగా కనిపిస్తున్నాడు. ఇప్పటివరకూ నాగ శౌర్య చేసిన పాత్రలన్నింటి కంటే ఈ రోల్ డిఫరెంట్‌గా ఉండబోతోంది అని తెలుస్తోంది.
It’s a Crazy experience & #Krishna will be Loved by all! ❤️
Here’s the First Look Poster
of #NS22 #IRA4 😍✨ #𝐊𝐫𝐢𝐬𝐡𝐧𝐚𝐕𝐫𝐢𝐧𝐝𝐚𝐕𝐢𝐡𝐚𝐫𝐢 ✨@ShirleySetia #AneeshKrishna #SaiSriram @realradikaa @mahathi_sagar @YEMYENES @ira_creations @UrsVamsiShekar pic.twitter.com/VHbemaEPFv
— Naga Shaurya (@IamNagashaurya) January 22, 2022
కాగా ఈసినిమాలో షిర్లే సెటియా హీరోయిన్ గా నటిస్తుండగా.. రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు పలు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా ముల్‌పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తుండగా.. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: