టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి సమంత. తన సినిమాలతో.. తన పాత్రలతో ఎంతో మందిని మెప్పించింది. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాదు హోస్ట్, బిజినెస్ రంగంలోనూ, వెబ్ సిరీస్ లు, సేవా కార్యక్రమాలు ఇలా అన్నింటిలో తన మార్క్ చూపిస్తూ ఆల్ రౌండర్ పేరు తెచ్చుకుంది. ఇక సామ్ కూడా ఏదో ఒక వార్త ద్వారా సోషల్ మీడియాలో ఎప్పుడూ టాక్ ఆప్ ద టౌన్ గానే ఉంటుందన్న సంగతి తెలిసిందే. అప్పట్లో సినిమాలు, ఇంకా వ్యక్తి గత జీవితం గురించి పలు వార్తలు వచ్చేవి.. ఇప్పుడు చైతుతో డివోర్స్ అయిన తరువాత ఎక్కువగా దానికి సంబంధించిన వార్తలే వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా సమంత తన ఇన్ట్సాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇక ఆ వీడియోలో సమంత స్కీయింగ్ చేస్తుంది. ప్రస్తుతం యూరప్ ట్రిప్‌లో ఉన్న సమంత స్విట్జర్లాండ్ లో సరదాగా గడుపుతుంది. ఈనేపథ్యంలో సామ్.. అక్కడ స్కీయింగ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ.. దానికి మీ ఈగోను ఇంటివద్దే వదిలేయండి.. ఇక న్యూ బిగినింగ్స్ స్టార్ట్ అంటూ వీడియో కు క్యాప్షన్ కూడా పెట్టింది సామ్. ప్రస్తుతం సామ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
View this post on Instagram
ప్రస్తుతం సమంత తన కెరీర్ పై దృష్టి పెట్టింది. వరుసగా కొత్త ప్రాజెక్ట్స్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ బిజీ షెడ్యూల్ గడిపేయడానికి సిద్ధమైంది. ఇక ఇప్పటికే శాకుంతలం సినిమా పూర్తిచేసిన సామ్.. ఇప్పుడు యశోద మూవీ చేస్తుంది. ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే అల్లు అర్జున్.. సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాలో మొదటి సారి స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టింది సామ్. ఈ పాట యూట్యూబ్లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో తెలుసు. మరోవైపు బాలీవుడ్ లో ప్రాజెక్స్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది సామ్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: