గత ఏడాది చివరిలో రిలీజ్ అయిన సినిమాల్లో అఖండ, పుష్ప సినిమాలు కాస్త పెద్ద సినిమాలు అని చెప్పొచ్చు. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాయి. వీటిలో పాన్ ఇండియా సినిమాగా వచ్చిన పుష్ప అటు తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లో కూడా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇక అఖండ సినిమా కూడా మాములు హిట్ కాదు బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈసినిమాతో అటు బాలకృష్ణ-బోయపాటి కూడా హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పటికే సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకొని ఇంకా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ ఉంది. తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఓవర్‌సీస్‌లో కూడా భారీ వసూళ్లను రాబట్టిందీ సినిమా. ఇటీవలి కాలంలో 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమాగా అరుదైన గుర్తింపును సంపాదించుకుంది. ఏకంగా 103 థియేటర్లలో 50 రోజులు విజయవంతంగా పూర్తిచేసుకొని మరో రికార్డ్ ను క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే పుష్ప ఓటీటీలో రిలీజ్ అయి సందడి చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ పుష్ప సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు అఖండ సినిమా కూడా ఓటీటీలోకి వచ్చేస్తుంది. డిస్నీ హాట్ స్టార్ లో నేటి నుండి ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది. మరి మీరు కూడా ఓటీటీ లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.

ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా పూర్ణ, శ్రీకాంత్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































