మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్నాడు. ఇప్పటికే తన రెండు సినిమాలను రిలీజ్ కు సిద్దం చేశాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండగా అది వాయిదా పడింది. తాజాగా ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ సినిమాను మార్చి 18, 2022న విడుదల చేయనున్నామని ప్రకటించారు. అప్పటికీ పరిస్థితులు నార్మల్ గా లేకపోతే ఏప్రిల్ 28నే ఈసినిమాను రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇక మరోవైపు ఆచార్య సినిమా కూడా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఏప్రిల్ 1న ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. మరి ఆరోజే రిలీజ్ అవుతుందా లేక మళ్లీ రిలీజ్ డేట్ ను ఏమైనా మార్చుతారా అన్నది చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఇప్పటికే కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోగా మళ్లీ తిరిగి షూటింగ్ ను మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. ఈ కొత్త షెడ్యూల్‌ను ఫిబ్రవరి నుండి మొదలుపెట్టనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక పాటతో ఈ షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి ఈసినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: