సుకుమార్- బన్నీ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా పుష్ప ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందే తెలిసిందే కదా. మొదటిసారి పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బన్నీ మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు. మన తెలుగు ప్రేక్షకులకు బన్నీ సినిమాలు ఎలా ఉంటాయో తెలుసు. ఇక పుష్పతో నార్త్ లో కూడా తన సత్తాను చాటాడు. ఇక ఇప్పుడు అదే క్రేజ్ ను క్యాచ్ చేసుకోవాలని చూస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. ఈనేపథ్యంలో బన్నీ అల వైకుంఠపురములో సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నారు. నిజానికి ఈసినిమా రీమేక్ కూడా వస్తుంది బాలీవుడ్ లో. కానీ ముందే డబ్బింగ్ చేసి ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా హిందీ హక్కులను గోల్డ్ మైన్స్ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే కదా. ఇక రిపబ్లిక్ డే స్పెషల్‌గా విడుదల చెయ్యబోతున్నట్లు కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు రిలీజ్ లో చిన్న ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా థియేటర్లలోకి రావడం లేదంటూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. అక్కడ కరోనా ప్రభావం ఎక్కువ ఉండటంతో మరోవైపు కేసులు పెరుగుతుండడంతో వచ్చే ఆ 50 శాతం ప్రేక్షకులు కూడా వస్తారో రారో అన్న అనుమానంతో గోల్డ్ మైన్స్ వారు తమ ఢించాక్ టీవీలో ఫిబ్రవరి 6నుండి హిందీ వెర్షన్ ను రిలీజ్ చేస్తున్నారు.
కాాాాాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం అల వైకుంఠపురములో. 2020 లో సంక్రాంతికి రిలీజ్ అయిన ఈసినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈసినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. షెహజాదా అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. బన్నీ, పూజా హెగ్డే పాత్రల్లో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ కనిపించనున్నారు. ఏక్తా కపూర్, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను ఈఏడాది చివరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: