సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు ఫ్యామిలీ పరంగా కానీ.. ఇటు కెరీర్ పరంగా కానీ మహేష్ సూపర్ సక్సెస్ లో ఉన్నాడంటే ఆ సక్సెస్ వెనుక నమ్రత కూడా ఉందన్న సంగతి ఒప్పుకోవాల్సిందే. ఇక నేడు నమ్రత తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా మహేష్ నమ్రతకు తన ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ అందించారు. హ్యాపీ బర్త్ డే నమ్రత.. నా ప్రపంచాన్ని నాతో పంచుకున్నందుకు నీకు థ్యాంక్స్ అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు మహేష్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Happy birthday NSG… You are my rock ♥️♥️♥️ Thank you for sharing my world with me.. 🤗🤗🤗 pic.twitter.com/YwjokokKtz
— Mahesh Babu (@urstrulyMahesh) January 22, 2022
ఇక సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వకముందు మోడలింగ్ లో రాణించింది నమ్రత. ఆ తర్వాత 1993లో నమ్రత మిస్ ఇండియా, మిస్ ఏషియా పసిఫిక్‌గా ఎంపికైంది. ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘వంశీ’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒక్క సినిమాతోనే ప్రేమలో పడ్డారు.. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లోనే బెస్ట్ కపుల్స్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు ఈ దంపతులు.
కాగా మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేష్ స్వయంగా నిర్మిస్తున్న ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.