దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటని చెప్పొచ్చు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-చరణ్ ప్రధాన పాత్రల్లో ఈ క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కింది. మూడేళ్లుగా ఈసినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఎన్నో రిలీజ్ డేట్ లు మారాయి. ఇక ఫైనల్ గా ఈ ఏడాది సంక్రాంతికి ఈసినిమా విడుదల అవుతుందని అందరూ వేయి కళ్లతో ఎదురుచూశారు. కానీ కరోనా థర్డ్ వేవ్ వల్ల మళ్లీ రిలీజ్ కు బ్రేక్ పడింది. థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గడం.. దానికి తోడు కొన్ని చోట్ల థియేటర్లు కూడా మూత పడటంతో రిలీజ్ ను వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తామని ప్రకటించలేదు. కేవలం సరైన సమయం చూసుకొని విడుదల చేస్తామని మాత్రమే చెప్పారు. మరోవైపు ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురైనా.. మళ్లీ కొత్త రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఆ టైమ్ వచ్చేసింది. ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అయితే మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు. పరిస్థితులు కాస్త మారి.. థియేటర్లు మళ్లీ తెరిచి పూర్తి స్థాయిలో ఆక్యుపెన్సీ వస్తే ఈ సినిమాను మార్చి 18, 2022న విడుదల చేయనున్నామని ప్రకటించారు. లేనిపక్షంలో ఈసినిమా ఏప్రిల్ 28నే ఈసినిమాను రిలీజ్ చేస్తామని తెలిపారు. చూద్దాం మరి అప్పటికీ పరిస్థితులు నార్మల్ గా మారుతాయో.. లేక ఇప్పటిలాగే ఉంటాయో..
#RRRMovie on March 18th 2022 or April 28th 2022. 🔥🌊 pic.twitter.com/Vbydxi6yqo
— RRR Movie (@RRRMovie) January 21, 2022
కాగా భారత స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా తెరకెక్కిన ఫిక్షన్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్’. అల్లూరిగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: