ప్రస్తుతం టాలీవుడ్ సినిమా మార్కెట్ రేంజ్ పెరిగిపోయింది అని చెప్పొచ్చు. మన వాళ్లు భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి అస్సలు వెనుకాడటంలేదు. స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ నుండి సినిమా వస్తుందంటే చాలు పాన్ ఇండియా సినిమానే అవుతుంది. సినిమా హిట్ అయినా ఫట్ అయినా నిర్మాతలు కూడా ఏ మాత్రం రాజీ పడకుండా ధైర్యంగా సినిమాలు తీస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమాలను నార్త్ లో ఇప్పుడు ఆదరించినంత ఉండేది కాదు.. కానీ బాహుబలి తో తెలుగు సినిమా మార్కెట్ పూర్తిగా మారిపోయింది. ఆ తరువాత సాహో సినిమా.. ఇక గత రెండు మూడేళ్లలో ఎన్నో సినిమాలు.. ఇక రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమా తెలుగు సినిమా సత్తాను నార్త్ బాక్సాఫీస్ వద్ద చూపించాయి. ఇప్పుడు మన హిట్ సినిమాలను వాళ్లు చాలా వరకూ రీమేక్ చేసుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీపై బాలీవుడ్ భామ అనన్య పాండే పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అనన్య లైగర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇక ఈభామ తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్ లో పాల్గొని.. లైగర్ సినిమాలో తను ఒక మంచి రోల్ లో నటించానని.. ఇక ముందు కూడా రీజనల్ సినిమాల్లో.. అలాగే తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించాలని ఉందని తెలిపింది. అంతేకాకుండా.. టాలీవుడ్ సినిమా రీజనల్ సినిమా కాదని.. ఇప్పుడు పాన్ ఇండియా కింగ్ అయిందని.. నిజానికి బాలీవుడ్ సినిమాలు కొన్ని హిందీ మాట్లాడే ప్రాంతాల్లోనే రన్ అవుతున్నాయి.. కానీ తెలుగు సినిమాలు కేవలం తెలుగులోనే కాదు అటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా బాగా రన్ అవుతున్నాయి అని చెప్పుకొచ్చింది. చూద్దాం మరి లైగర్ సినిమాతో అనన్య పాండే ఎంత వరకూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందో.. ఏ రకంగా అవకాశాలను చేజిక్కించుకుంటుందో..
కాగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా వస్తుంది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: