
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 197


లవ్ మ్యారేజ్ చేసుకుంటా - రష్మిక

'ఆర్ఆర్ఆర్' నిర్మాతతో నాగ చైతన్య సినిమా..?

"బెర్లిన్ బేబీ" అలియా భట్

"ప్రాజెక్ట్ K "మూవీ అప్ డేట్

"గాడ్ ఫాదర్ "మూవీ లేటెస్ట్ షెడ్యూల్ పూర్తి

షూటింగ్ పూర్తి చేసుకున్న 'భీమ్లానాయక్'

సమ్మర్ లో రిలీజ్ కానున్న టాలీవుడ్ మూవీస్

'పుష్ప.. ది రూల్' కు పెరుగుతున్న డిమాండ్

హిందీ భాషలో "ఆచార్య " మూవీ రిలీజ్

'బప్పీ లహరి' బాణీ ప్రత్యేకమైనది..!

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' డబ్బింగ్ పూర్తి చేసిన శర్వా

"చిరంజీవి 154 "మూవీ లో బాబీ సింహా

నాని-కీర్తి సురేష్ ల 'దసరా' మొదలు..!

1,080 ఎకరాల ఫారెస్ట్ ను దత్తత తీసుకున్న నాగార్జున..!
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇప్పటికే విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఛాలెంజ్ లో పాల్గొన్ని ఎన్నో మొక్కలను నాటారు. ఇక దీనిలో భాగంగానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాజిపల్లిలో 1,650 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే కదా. తన తండ్రి పేరిట ప్రభాస్ దానిని అభివృద్ధి చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో అగ్రహీరో కూడా ముందుకొచ్చారు. ఆ అగ్రహీరో ఎవరో కాదు కింగ్ నాగార్జున.

లవ్ మ్యారేజ్ చేసుకుంటా - రష్మిక
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రష్మిక మందన్న తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ” 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. రష్మిక ప్రస్తుతం శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళు మీకు జోహార్లు ” , బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ స్ లో కథానాయికగా నటిస్తున్నారు.

'ఆర్ఆర్ఆర్' నిర్మాతతో నాగ చైతన్య సినిమా..?
'సెకండ్ హ్యాండ్' సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమైనా కూడా 'నేను శైలజ' చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు కిషోర్ తిరుమల. ఇప్పటి వరకూ తెలుగులో 'ఉన్నది ఒకటే జిందగీ', 'చిత్రలహరి', 'రెడ్' వంటి సినిమాలకు దర్శకత్వం వహించగా. ఇప్పుడు 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' అనే సినిమాతో వస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ఈనెల 25వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ అయ్యారు మేకర్స్. ఈ నేపథ్యంలో కిషోర్ తిరుమల మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

"బెర్లిన్ బేబీ" అలియా భట్
సూపర్ హిట్ “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ “(2012 ) మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన అలియా భట్ పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.అలియా ప్రస్తుతం “బ్రహ్మాస్త్ర ” , “డార్లింగ్స్ “, “రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ “మూవీస్ లో నటిస్తున్నారు.భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం”మూవీ తో అలియా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు . “NTR30 “మూవీ కి అలియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

సాంగ్ చిత్రీకరణ లో "అంటే .. సుందరానికీ! "
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో హీరో నాని కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ పేరుతో నటిస్తున్నారు.ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కనున్న “దసరా “మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.

'వర్జిన్ స్టోరీ'.. కథలో వర్జినిటీ చెప్పేదే ఈసినిమా..!
నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘వర్జిన్ స్టోరీ’. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కించగా ఈ నెల 18వ తేదీన ఈసినిమా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఇటీవలే ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. ఇక ఈసినిమా ప్రమోషన్ లో భాగంగా తాాజాగా లగడపాటి శ్రీధర్ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలు పంచుకున్నారు. మరి ఈసినిమా గురించి ఆయన ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం..

"ప్రాజెక్ట్ K "మూవీ అప్ డేట్
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ”తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

"గాడ్ ఫాదర్ "మూవీ లేటెస్ట్ షెడ్యూల్ పూర్తి
మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్” , స్టైలిష్ మూవీ దర్శకుడు మెహెర్ రమేష్ దర్శకత్వంలో సూపర్ హిట్ “వేదాళం “తమిళ మూవీ తెలుగు రీమేక్ “భోళా శంకర్ “, కె ఎస్ రవీంద్ర (బాబీ ) దర్శకత్వంలో “చిరంజీవి 154 ” మూవీస్ సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. ఈ మూడు సినిమాల షూటింగ్స్ లో చిరంజీవి ఒకే సారి పాల్గొనడం విశేషం.

షూటింగ్ పూర్తి చేసుకున్న 'భీమ్లానాయక్'
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నుండి సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక రీఎంట్రీ తర్వాత కూడా పవన్ ఏ మాత్రం తగ్గట్లేదు. వస్తూ వస్తూనే వకీల్ సాబ్ లాంటి బ్లాక్ బస్టర్ తో బోణీ కొట్టాడు. ఇక ఇప్పుడు అందరి చూపు భీమ్లానాయక్ పై ఉంది. ఈసినిమాకు కూడా మాములు క్రేజ్ లేదు. గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచితే.. పాటలు మరో రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఈసినిమా సంక్రాంతి బరిలో దిగాలి కానీ థర్డ్ వేవ్ వల్ల సాధ్యంకాలేదు.

యువతను ఆకట్టుకుంటున్న 'వర్జిన్ స్టోరీ' సినిమా ట్రైలర్
ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త తరం హీరో హీరోయిన్స్ సందడి ఎక్కువైంది. మేకర్స్ కూడా యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తూ సినిమాలు తీస్తున్నారు. ఇక ఇప్పుడు అలాంటి యూత్ ఫుల్ ఎంటర్ టైనరే మరొకటి రిలీజ్ కు సిద్దమవుతుంది. అల్లు అర్జున్ రేసుగుర్రం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన విక్రమ్ సహిదేవ్.. ఆతరువాత అదే అల్లు అర్జున్ నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా సినిమాలో కీలక పాత్రలో చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన రౌడీబాయ్స్ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. ఇక ఇప్పుడు హీరోగా మరో సినిమాతో వస్తున్నాడు.

సమ్మర్ లో రిలీజ్ కానున్న టాలీవుడ్ మూవీస్
కరోనా , కరోనా నిబంధనలు , ఆంధ్ర ప్రదేశ్ టికెట్ రేట్స్ కారణంగా పలు మూవీస్ విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. 2022 సంవత్సరంలో "బంగార్రాజు ", "డీ జే టిల్లు " వంటి మూవీస్ సక్సెస్ సాధించడం తో సమ్మర్ లో పలు సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. ఆ మూవీస్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన స్టార్ హీరోల మూవీస్ తో పాటు యువ హీరోల మూవీస్ కూడా ఉన్నాయి.

'పుష్ప.. ది రూల్' కు పెరుగుతున్న డిమాండ్
పుష్ప ముందు వరకూ స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ పేరును పుష్ప సినిమా చేస్తున్నప్పుడే సుకుమార్ ఐకాన్ స్టార్ అని మార్చేశారు. ఇక పుష్ప రిలీజ్ అయి ఇప్పుడు ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం చూస్తుంటే సుకుమార్ అందుకే అంత ధైర్యంగా ఐకాన్ స్టార్ అని మార్చాడేమో అని అనిపిస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని పాన్ ఇండియా స్టార్‌గా మార్చిన మూవీ ‘పుష్ప ది రైజ్’. పాన్ ఇండియా మూవీగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. గత ఏడాది విడుదలైన చిత్రాలన్నింటిలో రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రంగా ‘పుష్ప ది రైజ్’ చిత్రం నిలిచింది. సౌత్ లో హిట్ అవ్వడం ఒక లెక్కయితే.. నార్త్ లో సూపర్…

హిందీ భాషలో "ఆచార్య " మూవీ రిలీజ్
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ 2022 ఎప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , లాహే లాహే, నీలాంబరి, శానా కష్టం సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టెంపుల్ టౌన్ సెట్ , రామ్ చరణ్ , పూజాహెగ్డే ల సాంగ్…

'బప్పీ లహరి' బాణీ ప్రత్యేకమైనది..!
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు నేడు తుది శ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ముంబైలోని క్రిటీ కేర్ ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స తీసుకుంటూ ఆయన మృతి చెందారు. రేపు ఆయన అంత్యక్రియలు జరిపించనున్నారు. ఇక ఇప్పటికే టాలీవుడ్ నుండి పలువురు సినీ ప్రముఖులు బప్పి లహరి మరణంపై సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియచేశారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు ఇలా ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' డబ్బింగ్ పూర్తి చేసిన శర్వా
క్లాస్, మాస్, ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్స్ ఇలా ఏ జోనర్ లో అయినా నటించగలిగిన టాలీవుడ్ యంగ్ హీరో నటుడు శర్వానంద్. ఇటీవలే మహా సముద్రం లాంటి మాస్ యాక్షన్ సినిమాతో అలరించిన శర్వా.. ఇప్పుడు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్, రష్మికా మందన్న జంటగా నటించిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. ఈసినిమా ఈనెల 25న రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇక మరోవైపు రిలీజ్ కు ఇంకా పది రోజులు కూడా లేదు. అయితే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలోనే ఉంది. ఇక దీనిలో భాగంగానే శర్వా తాజాగా తన డబ్బింగ్ ను పూర్తి…

బప్పి లహరి బెస్ట్ తెలుగు సాంగ్స్
బాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసి సూపర్ హిట్ సాంగ్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. సూపర్ స్టార్ కృష్ణ "సింహాసనం "మూవీ తో బప్పి లహరి సంగీత దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో "ఆకాశంలో ఒక తార "సాంగ్ హైలైట్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి "స్టేట్ రౌడీ ", "గ్యాంగ్ లీడర్ ", "రౌడీ అల్లుడు " చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన బప్పి లహరి అద్భుతమైన సాంగ్స్ కంపోజ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

"చిరంజీవి 154 "మూవీ లో బాబీ సింహా
మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో "గాడ్ ఫాదర్ ", మెహెర్ రమేష్ దర్శకత్వంలో "భోళా శంకర్ ", బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం లో "చిరంజీవి 154 "మూవీ సెట్స్ పైన ఉన్నాయి. చిరంజీవి ఈ మూడు సినిమాలలో నటించడం విశేషం. ఈ మూవీస్ కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన "ఆచార్య "మూవీ ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానుంది.

"బీస్ట్ " మూవీ సాంగ్ కు పూజా హెగ్డే డ్యాన్స్
టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్”, “బీస్ట్ ”( తమిళ} మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజాహెగ్డే జంటగా తెరకెక్కనున్న “#SSMB28”,మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే…

భారీ యాక్షన్ సీన్ చిత్రీకరణ లో "సర్కారు వారి పాట"
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ , కళావతి సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.”సర్కారు వారి పాట”మూవీ దుబాయ్ , హైదరాబాద్ , గోవా , స్పెయిన్ లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది.

నాని-కీర్తి సురేష్ ల 'దసరా' మొదలు..!
రీసెంట్ గా శ్యామ్ సింగ రాయ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇక ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఒక దాని తరువాత ఒకటి అనుకుంటూ పట్టాలెక్కించేస్తున్నాడు నాని. అందులో దసరా సినిమా కూడా ఒకటి. గత సంవత్సరం దసరా రోజు నాని ‘దసరా’ సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ ఇంకా మొదలు కాకముందే నాని లుక్ ను రిలీజ్ చేసిన సంగతి కూడా విదితమే. ఈసినిమాలో నాని కొత్త మేకోవర్ లో అలానే ఫుల్ మాస్ అవతారంలో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో తెలంగాణ గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సాగుతుందని ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి.