సూపర్ హిట్ “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ “(2012 ) మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన అలియా భట్ పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.అలియా ప్రస్తుతం “బ్రహ్మాస్త్ర ” , “డార్లింగ్స్ “, “రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ “మూవీస్ లో నటిస్తున్నారు.భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం”మూవీ తో అలియా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు . “NTR30 “మూవీ కి అలియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జర్మనీలోని బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో “గంగూబాయి కతియావాడి” మూవీ ప్రీమియర్ కోసం అలియా భట్ మరియు కొంతమంది చిత్ర ప్రముఖులు బెర్లిన్ వెళ్లారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో బెర్లిన్‌లో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బెర్లిన్ కు చేరిన అలియా ప్రీమియర్ కు ముందు అభిమానుల కోసం ఫొటోషూట్ లో పాల్గొన్నారు.ఆ ఫోటోలను “బెర్లిన్ బేబీ” అంటూ అలియా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: