
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 198


బప్పి లహరి మరణం.. చిరు-బాలకృష్ణ సంతాపం..!

సింగర్ , మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి ఇక లేరు

కూతురి సినిమాకు నిర్మాతగా మారిన తల్లి..!

'కె.జి.యఫ్ 2' తో ఢీకొట్టనున్న జెర్సీ..!

"భీమ్లా నాయక్" మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

'ఆదిపురుష్' రిలీజ్ డేట్ వాయిదా..?

హీరోయిన్ అవికా గోర్ లవ్ స్టోరీ

"రాకెట్రీ :ది నంబి ఎఫెక్ట్ " రిలీజ్ డేట్

హీరో సిద్దు జొన్నలగడ్డ పై టాలీవుడ్ ఫోకస్
నో డౌట్.. చెప్పిన డేట్ కే 'గని' రిలీజ్

అభిమాని కల నెరవేర్చిన 'రామ్ చరణ్'

"లవ్ మౌళి " మూవీ హీరోయిన్ పరిచయ వీడియో రిలీజ్

అజిత్ "వాలిమై" మూవీ న్యూ గ్లింప్స్ రిలీజ్

చియాన్ విక్రమ్ "కోబ్రా "మూవీ షూటింగ్ పూర్తి
సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్"కోబ్రా " తమిళ మూవీ చిత్రీకరణ కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ లో శ్రీనిధి శెట్టి , మియా జార్జ్ , క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ముఖ్య పాత్రలలో నటించారు."కోబ్రా " మూవీ తో బ్లాక్ బస్టర్ "కె జి ఎఫ్ చాప్టర్ 1"మూవీ ఫేమ్ శ్రీనిధి శెట్టి , క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

లీకు రాయుళ్లకు 'RC 15' మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్..!
ఎన్ని చర్యలు తీసుకున్నా సినిమా లీకులను ఆపడం మాత్రం చాలా కష్టమే. మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక లీకు బయటకు వస్తూనే ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా షూటింగ్ జరిపే రాజమౌళి లాంటి డైరెక్టర్ కే లీకులు తప్పలేదు. అలాంటిది అవుట్ డోర్ షూటింగ్ లు అంటే ఏ రేంజ్ లో లీకులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో కళావతి సాంగ్ కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. దానిపై థమన్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు చరణ్ సినిమాకు కూడా అలాంటి పరిస్థితే వచ్చింది.

బప్పి లహరి మరణం.. చిరు-బాలకృష్ణ సంతాపం..!
ఇటీవలే భారతరత్న, గాన కోకిల గా పేరు గాంచిన లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ను కోల్పోయాం. ఇక ఇప్పుడు మరో లెజెండరీ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహరి ని కోల్పోయింది చిత్ర పరిశ్రమ. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనని ముంబైలోని క్రిటీ కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స తీసుకుంటున్న బప్పి లహిరి నిన్న రాత్రి మరణించారు. ఇక బప్పి లహరి మృతిపై బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ తో సహా దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సింగర్ , మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి ఇక లేరు
"నన్హా షికారి "(1973 ) మూవీ తో బాలీవుడ్ కు సంగీత దర్శకుడిగా పరిచయం అయిన బప్పి లహరి , "సురక్ష " (1979 ) మూవీ తో సింగర్ గా మారారు. హిందీ, బెంగాలీ , తెలుగు , కన్నడ , తమిళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందించి ప్రేక్షకులను అలరించారు. సింగర్ గా బప్పి లహరి పలు బ్లాక్ బస్టర్ సాంగ్స్ తో ప్రేక్షకుల ను వీనుల విందు చేశారు. బప్పి లహరి అనారోగ్యం తో కన్ను మూయడం తో ప్రముఖ గాయకుడు , సంగీత దర్శకుడిని కోల్పోయి భారతీయ చలన చిత్ర పరిశ్రమ విషాదం లో మునిగిపోయింది.

కూతురి సినిమాకు నిర్మాతగా మారిన తల్లి..!
సినీ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ రావాలంటే హార్డ్ వర్క్ ఎంత ఉండాలో అలానే కాస్త అదృష్టం కూాడా ఉండాలి. లేకపోతే ఎంత కష్టపడినా కొంతమంది సక్సెస్ అందుకోవడం కష్టం. ఇక యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్ పరిస్థితి కూడా అదే. ‘చల్ మోహనరంగ, లై’ సినిమాలతో ఆకట్టుకున్నా సరైన హిట్ అందుకోలేకపోయింది నటి మేఘ. ఆ తర్వాత తెలుగులో పెద్దగా ఛాన్స్ లు కూడా రాలేదు. అయితే ఈ గ్యాప్ లో తమిళ్ లో సినిమాలు చేసింది. వరుస అవకాశాలు అయితే వస్తున్నాయి కానీ ఈ అమ్మడు మాత్రం ఇప్పటివరకూ సక్సెస్ టేస్ట్ మాత్రం చూడలేకపోతుంది. ఇటీవల డియర్ మేఘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది కూడా గట్టెక్కించలేకపోయింది.

రేపటి నుండి "ప్రాజెక్ట్ K " మూవీ సెట్స్ లో ప్రభాస్
బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతున్నవిషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

'కె.జి.యఫ్ 2' తో ఢీకొట్టనున్న జెర్సీ..!
కరోనా థర్డ్ వేవ్ తరువాత సినిమాలు వరుసగా రిలీజ్ అవుతుండటంతో చాలా సినిమాలకు పోటీ తప్పట్లేదు. నిజానికి సంక్రాంతికి చాలా సినిమాలు పోటీకి సిద్దపడినా ఆ తరువాత ఆ బరి నుండి తప్పుకున్నాయి. ఇక ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగుపడటంతో మళ్లీ రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకుంటున్నారు మేకర్స్. అయితే చాలా జాగ్రత్తగా రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నా రిలీజ్ క్లాష్ లు తప్పడం లేదు. ఈ ఫిబ్రవరి 25నే చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బరికి దిగాయి. గని, భీమ్లానాయక్ తో పాటు ఇంకా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి.

"భీమ్లా నాయక్" మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” తెరకెక్కిన విషయం తెలిసిందే. “భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందించారు. "భీమ్లా నాయక్”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'ఆదిపురుష్' రిలీజ్ డేట్ వాయిదా..?
ఇక ఇప్పుడు ఈసినిమా రిలీజ్ కూడా వాయిదా పడనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దానికి కారణం అమీర్ ఖాన్ సినిమా లాల్ సింగ్ చద్దా సినిమానే అంటున్నారు. అద్వైత్ చందన్ దర్శకత్వం అమీర్ ఖాన్ హీరోగా వస్తున్న సినిమా లాల్ సింగ్ చద్దా. ఈసినిమాలో నాగ చైతన్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈసినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇంకా రిలీజ్ కు సిద్దం కాకపోవడంతో ఈసినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈసినిమాను అనుకున్న టైమ్ లో పూర్తి చేయలేకపోయాం అందుకే ఏప్రిల్ 14న ఈసినిమాను రిలీజ్ చేయలేకపోతున్నాం.. అయితే ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ చేస్తున్నాం అంటూ కొత్త రిలీజ్…

బిగ్ బాస్ ఓటీటీ ప్రోమో రిలీజ్..!
టెలివిజన్ ప్రేక్షకులకు బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీలో ఎన్నో ఏళ్ల క్రితం మొదలైన ఈ షో ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా పలు భాషల్లో ప్రసారమవుతుంది. ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ ఐదు సీజన్స్ ను కంప్లీట్ చేసుకుంది. ఇక త్వరలో ఆరవ సీజన్ ను మొదలుపెట్టనుంది. అయితే దానికి ఇంకా చాలా టైముంది. అయితే ఈగ్యాప్ లో ఓటీటీ బిగా బాస్ కు రంగం సిద్దం చేశారు. ఓటీటీ బిగ్ బాస్ కూడా ఇప్పటికే హిందీలో మొదలైపోయింది. ఇప్పుడు తెలుగులో కూడా ఓటీటీ బిగ్ బాస్ ను తీసుకొస్తున్నారు.

హీరోయిన్ అవికా గోర్ లవ్ స్టోరీ
సక్సెస్ ఫుల్ "ఉయ్యాల జంపాల " మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన అవికా గోర్ "సినిమా చూపిస్త మావ ", "ఎక్కడికి పోతావు చిన్నవాడా ", "రాజు గారి గది 3 " వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. అవికా గోర్ ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తెరకెక్కిన "థ్యాంక్యూ "మూవీ లో ఒక కీలక పాత్రలో నటించారు. అవికా కథానాయిక గా నటిస్తున్న" టెన్త్ క్లాస్ డైరీస్ "" చిత్రీకరణ జరుపుకుంటుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'హే సినామిక'.. ట్రైలర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్..!
ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా దర్శకత్వంలో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా హే సినామిక. ఈ సినిమా మార్చి 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇక ఈసినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా ఈసినిమాకు క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బృందం ఈసినిమాకు. అంతేకాదు తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. రేపు అంటే ఫిబ్రవరి 16వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

వాలెంటైన్స్ డే సందర్భంగా హార్ట్ సింబల్ బెలూన్స్ తో లావణ్య త్రిపాఠి
సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి“మూవీతో కథానాయికగా టాలీవుడ్ కు పరిచయమయిన క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి , ఆ మూవీ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు. మైత్రీ మూవీ మేకర్స్ , క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై “మత్తు వదలరా”మూవీ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం , లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కనున్న కామెడీ ఎంటర్ టైనర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. తాజాగా ఒక తమిళ మూవీ కి లావణ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

"రాకెట్రీ :ది నంబి ఎఫెక్ట్ " రిలీజ్ డేట్
"అలై పాయుదే "మూవీ తో కోలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన మాధవన్ పలు సూపర్ హిట్ తమిళ , హిందీ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తమిళ మూవీస్ డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. కొన్ని ఇంగ్లీష్ , కన్నడ , మలయాళ మూవీస్ లో నటించిన మాధవన్ 3 హిందీ మూవీస్ లో నటిస్తున్నారు. ఒక బయోగ్రాఫికల్ మూవీ తో మాధవన్ దర్శకుడిగా మారుతున్నారు.

హీరో సిద్దు జొన్నలగడ్డ పై టాలీవుడ్ ఫోకస్
"LBW" మూవీ తో లీడ్ రోల్ లో టాలీవుడ్ కు పరిచయం అయిన సిద్దు జొన్నలగడ్డ , "సక్సెస్ ఫుల్ "గుంటూర్ " మూవీ తో హీరో,రైటర్ , సింగర్ గా ప్రేక్షకులకు సిద్ధూ పరిచయం అయ్యారు. "కృష్ణ అండ్ హిజ్ లీల" మూవీ తో ప్రేక్షకులను అలరించిన సిద్దు “డీజే టిల్లు” మూవీ తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. “డీజే టిల్లు” మూవీ ఫిబ్రవరి 12వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ తో దూసుకు పోతోంది. ఓవర్ సీస్ లో, నైజాం లో మొదటి రోజే బ్రేక్ ఈవెన్ అయ్యి “డీజే టిల్లు”మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.
నో డౌట్.. చెప్పిన డేట్ కే 'గని' రిలీజ్
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గని. బాక్సింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. ఈసినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపిస్తుండగా.. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఈసినిమాలో సిక్స్ ప్యాక్ చేసి సరికొత్త ఫిజిక్‌తో కనిపిస్తున్నాడు వరుణ్ తేజ్. ఈసినిమా షూటింగ్ జరపుతూనే మరోపక్క ప్రమోషన్స్ కూడా చేశారు మేకర్స్. ప్రస్తుతం అయితే అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అభిమాని కల నెరవేర్చిన 'రామ్ చరణ్'
టాలీవుడ్ లో మన హీరోలను అభిమానులు ఎలా ఆరాధిస్తారో మనకు తెలిసిందే. హీరోలను ఆ రేంజ్ లో అభిమానించడం మన దగ్గరే కాస్త ఎక్కువ ఉంటుంది. ఒక్కసారైనా తమ అభిమాన హీరోలతో మాట్లాడాలని, కలవాలని కోరుకుంటారు. ఇక మన హీరోలు కూడా తమ అభిమానులను అలానే చూస్తుంటారు. ఫ్యాన్స్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఇక తాజాగా రామ్ చరణ్ కూడా తన అభిమాని కలను నేరవేర్చాడు. రామ్ చరణ్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. గత కొద్దిరోజులుగా ఈసినిమా ఆంధ్రప్రదేష్ లో జరుపుకున్నారు.

"లవ్ మౌళి " మూవీ హీరోయిన్ పరిచయ వీడియో రిలీజ్
నైరా క్రియేషన్స్ బ్యానర్ పై అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్ , పంఖురి గిద్వానీ జంటగా ఒక మూవీ తెరకెక్కుతుంది. గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. నవదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాకు ”లవ్ మౌళి” అనే టైటిల్ ను మేకర్స్ ప్రకటించారు.రానా దగ్గుబాటి ట్విట్టర్ వేదికగా ”లవ్ మౌళి” టైటిల్ మోషన్ పోస్టర్ ఆవిష్కరించారు. టైటిల్ వెరైటీ గా ఉండి , నవదీప్ లుక్ డిఫరెంట్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న క్లాసిక్ మూవీ '96'
ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో వచ్చిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ '96' సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈసినిమాలో విజయ్ సేతుపతి, త్రిష తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు వచ్చిన అవార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు అవార్డులను సొంతం చేసుకుంది ఈసినిమా. జాను పాత్రలో చేసిన ఒక్క త్రిషకే 11 అవార్డులను తెచ్చిపెట్టింది ఈసినిమా.

అజిత్ "వాలిమై" మూవీ న్యూ గ్లింప్స్ రిలీజ్
జీ స్టూడియోస్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై” తమిళ మూవీ తెలుగు , కన్నడ , హిందీ భాషలలో ఫిబ్రవరి 24 వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కథానాయిక. అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో హీరో కార్తికేయ ఒక నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “వాలిమై” మూవీ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , ఫస్ట్ సింగిల్ , కార్తికేయ లుక్ , ఫస్ట్ గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.