‘బప్పీ లహరి’ బాణీ ప్రత్యేకమైనది..!

Pawan Kalyan Gets Emotional about Bappi Lahiri,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Pawan Kalyan,Power Star Pawan Kalyan,Power Star Pawan Kalyan movie updates,Power Star Pawan Kalyan About Bappi Lahiri,Power Star Pawan Kalyan Gets Emotional About Bappi Lahiri, Power Star Pawan Kalyan Emotional Tweet About Bappi Lahiri,Power Star Pawan Kalyan About Bappi lahiri Music,Power Star Pawan Kalyan Emotional Tweet Goes Viral,Bappi Lahiri Jimmy Jimmy Aaja Aaja Song, Bappi Lahiri Jimmy Jimmy Aaja Aaja Super Hit Song,Bappi Lahiri in Tollywood,Bappi Lahiri Music Director,Bappi Lahiri Latest,Bappi Lahiri Latest News,Bappi Lahiri News,Bappi Lahiri No More,Bappi Lahiri Passed Away, Bappi Lahiri Passed Away In Mumbai,Bappi Lahiri Passes Away,Bappi Lahiri Passes Away In Mumbai Hospital At 69, Bappi Lahiri Songs, Bappi Lahiri Super Hit Songs,Bappi Lahiri Telugu Compositions, Bappi Lahiri Telugu Hit Songs,Bappi Lahiri Telugu Movie,Bappi Lahiri Telugu Movies,Bappi Lahiri Telugu Songs,Bappi Lahiri’s First And Last Telugu Movies, Bappi Lahiri’s First And Last Telugu Movies As Music Director,Best Of Bappi Lahiri,Composer Singer Bappi Lahiri,Disco King Bappi Lahiri,Disco Raja, Hits Of Bappi Lahiri Songs,King Of Bollywood Disco Bappi Lahiri,King Of Bollywood Disco Passes Away At 69,King of Disco,latest telugu movies news, latest tollywood updates,RIP Bappi Lahiri,Simhasanam,Simhasanam Movie,Singer Composer Bappi Lahiri,Singer Composer Bappi Lahiri Passes Away,super star krishna, Veteran Singer Composer Bappi Lahiri,#BappiLahiri,#RIPBappiLahiri

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు నేడు తుది శ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ముంబైలోని క్రిటీ కేర్ ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స తీసుకుంటూ ఆయన మృతి చెందారు. రేపు ఆయన అంత్యక్రియలు జరిపించనున్నారు. ఇక ఇప్పటికే టాలీవుడ్ నుండి పలువురు సినీ ప్రముఖులు బప్పి లహరి మరణంపై సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియచేశారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు ఇలా ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన ట్విట్టర్ ద్వారా బప్పీ లహరి మృతిపై సంతాపం తెలియచేస్తూ పోస్ట్ చేశారు. శ్రీ బప్పీ లహరి బాణీ ప్రత్యేకమైనది. భారతీయ చలనచిత్ర సంగీత విభాగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ స్వరకర్త శ్రీ బప్పీ లహరి కన్నుమూశారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. శ్రీ బప్పీ లహరి పాటలు హిందీ సంగీత ప్రియులకు ఎంత చిరపరిచితమో, తెలుగునాట కూడా ఆయన స్వరపరచిన గీతాలు అంతే ప్రాచుర్యం పొందాయి. డిస్కో తరహా పాటలతో ఒక తరాన్ని ఉర్రూతలూగించారు. డిస్కో డ్యాన్సర్ చిత్రంలోని ‘జిమ్మీ జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా ఆజా..’ పాట నేటికీ రష్యాతో సహా తూర్పు ఐరోపా దేశాల్లో వినిపిస్తుంది. అక్కడి పార్టీల్లో ఈ పాటకు యువత డ్యాన్స్ చేస్తుంటారు. డిస్కో డ్యాన్సర్ హీరో శ్రీ మిథున్ చక్రవర్తి ఆ దేశాలవాళ్ళకు పరిచయమయ్యారంటే అది శ్రీ బప్పీ లహరి బాణీ ప్రభావమే. గాయకుడిగానూ ఈతరం వాళ్ళను శ్రీ బప్పీ లహరి మెప్పించారు. తెలుగు చిత్రాలకు ఎన్నో చక్కటి గీతాలు ఇచ్చారు. అన్నయ్య చిరంజీవి గారు నటించిన ‘స్టేట్ రౌడీ’, ‘గ్యాంగ్ లీడర్’, ‘రౌడీ అల్లుడు’ లాంటి సినిమాలకు ఇచ్చిన పాటలు శ్రోతలను ఆకట్టుకొన్నాయి. సినీ రంగంలో శ్రీ బప్పీ లహరి బాణీ ప్రత్యేకమైనది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శ్రీ బప్పీ లహరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.” అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + fifteen =