వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ”తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
2023 సంవత్సరం ఏప్రిల్ లో విడుదల కానున్న “ప్రాజెక్ట్ K ” మూవీ దక్షిణాది భాషలు , హిందీ భాషతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు భాషలలో రిలీజ్ కానుంది. “ప్రాజెక్ట్ K ” మూవీ తాజా షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీ లో ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ , దీపిక , అమితాబ్ లపై కీలక సన్నివేశాలను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. హీరో ప్రభాస్ , దీపిక ఫస్ట్ టైమ్ జంటగా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న“ప్రాజెక్ట్ K ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































