టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్”, “బీస్ట్ ”( తమిళ} మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజాహెగ్డే జంటగా తెరకెక్కనున్న “#SSMB28”,మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
సన్ పిక్చర్స్ బ్యానర్ పై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ , పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన “బీస్ట్ “తమిళ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. వాలంటైన్స్ డే సందర్భంగా “బీస్ట్ “చిత్ర యూనిట్ “అరబిక్ కుతు”సాంగ్ ను రిలీజ్ చేసింది. ఆ సాంగ్ లో హీరో విజయ్ , పూజాహెగ్డే అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫామ్ చేసి ప్రేక్షకులను అలరించారు. యూట్యూబ్ లో ఆ సాంగ్ భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది. పూజాహెగ్డే ప్రస్తుతం ఫ్యామిలీ తో మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. మాల్దీవ్స్ లో పూజాహెగ్డే ఒక పడవ మీద “అరబిక్ కుతు”సాంగ్ కు డ్యాన్స్ చేసి ఆ వీడియో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































