నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘వర్జిన్ స్టోరీ’. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కించగా ఈ నెల 18వ తేదీన ఈసినిమా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఇటీవలే ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. ఇక ఈసినిమా ప్రమోషన్ లో భాగంగా తాాజాగా లగడపాటి శ్రీధర్ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలు పంచుకున్నారు. మరి ఈసినిమా గురించి ఆయన ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
2005 నుండి సినిమాలు నిర్మిస్తున్నారు.. ఈమధ్య చాలా గ్యాప్ వచ్చింది కారణం..?
మేము బ్యానర్ పెట్టినప్పుడే మంచి సినిమాలు.. డిఫరెంట్ జోనర్ లో తీయాలన్న లక్ష్యంతో పెట్టాం.. నేను ఏ కథకు కనెక్ట్ అయితే ఆ సినిమాలు మాత్రమే తీయగలను.. కమర్షియల్ సినిమాలు.. ఫార్మల్ సినిమాలు నేను తీయలేను.. ఎందుకంటే వాటికి నేను పెద్దగా కనెక్ట్ అవ్వను. ఈకథకు నేను కనెక్ట్ అయ్యాను అందుకే తీశాను.
విక్రమ్ సహిదేవ్ ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా అలాగే ప్రధాన పాత్రల్లో పలు సినిమాలు చేశాడు.. ఈసినిమాను డెబ్యూ అని చెప్పడానికి కారణం..?
నెంబర్స్ ను నేను నమ్మను.. విక్రమ్ అడల్ట్ గా మారిన తరువాత ఫస్ట్ ఫిలిం.. విక్రమ్ నాపేరు సూర్య-నా ఇల్లు ఇండిలా సినిమాలో చేసినప్పుడు 16 ఏళ్లు.. ఎవడు తక్కువకాదు సినిమా తీసినప్పుడు కూడా అదే వయసు. ఇప్పుడు ఈసినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పుడు 18 ఏళ్లు.. తనను లాంచ్ చేయడానికి ఇదే కరెక్ట్ టైమ్..
ఈ సినిమా టైటిల్ వర్జిన్ స్టోరీ పెట్టడానికి కారణం..?
ఈ ఇంటర్వ్యూ సందర్బంగా ఒక విషయంలో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఈసినిమా హీరో లేదా హీరోయిన్ వర్జినిటీకి సంబంధించింది కాదు.. ఈసినిమాలో ఉన్న వర్జినిటీ గురించి చెప్పడం జరిగింది. తెలుగు సినిమాల్లోనే ఇప్పటి వరకూ ఇలాంటి స్టోరీని తీయలేదు.. అలాంటి కాన్సెప్ట్ తో వస్తుంది కాబట్టే అలాంటి టైటిల్ పెట్టాం. ఈ సినిమాలో ఒక్క ముద్దు సీన్ కూడా లేదు.. ఇది క్లీన్ మూవీ.. యూత్ లో ఉన్న కన్ఫ్యూజన్, ఊహించని విధంగా ఉండే నేచర్ గురించి చెప్పే ప్రయత్నం చేసిన సినిమా ఇది.. ఈసినిమా చూసిన తరువాత ఖచ్చితంగా ఈసినిమా గురించి మాట్లాడుకుంటారు.. ముందుగా కొత్తగా రెక్కలొచ్చాయి అన్న వర్కింగ్ టైటిల్ పెట్టాం.. ఆతరువాత యూత్ సినిమా కాబట్టి వారికి కనెక్ట్ అయ్యేలా వర్జిన్ స్టోరీ అని పెట్టాం.
వర్జీన్ స్టోరీ గురించి
కథ గురించి ఇప్పుడే చెప్పను కానీ కొన్ని హాలీవుడ్ సినిమాల రిఫరెన్స్ ఇస్తాను. కిస్సింగ్ బూత్, బిపోర్ సన్ రైజ్, 10 థింగ్స్ ఐ హేట్ అబౌట్ యూ ఈ సినిమా జోనర్ లోనే వర్జీన్ స్టోరీ ఉంటుంది.
డైరెక్టర్ గురించి..
ప్రదీప్ బి. అట్లూరీ టొరొంటో ఫిలిం స్కూల్ స్డూడెంట్. తన లైఫ్ లో జరిగిన సంఘటనల ఆధారంగానే ఈ కథను రాశాడు. నేను కూడా ఈకథతో కనెక్ట్ అయ్యాను. తన కథను నమ్మి తనకు ఈసినిమా అవకాశం ఇచ్చారు. తన వరకూ తను చాలా బాగా తీశాడు.
సినిమా కథ..
ఈ సినిమా ఒక నైట్ లో జరిగే కథ. రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య జరిగే కథే ఈసినిమా. మధ్యలో ఫ్లాష్ బ్యాక్ లు వస్తుంటాయి.
ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
ఎవడి గోల వాడిది పార్ట్ 2 తీయాలన్న ప్లాన్ ఉంది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో ఈసినిమా ప్లాన్ చేస్తున్నా.. తనకు ఈ సినిమా గురించి చెప్పాను.. తను కనుక ఒప్పుకుంటే ఈసినిమాను తీస్తాను. దీనితో పాటు డ్యాన్స్ బేస్డ్ సినిమా కూడా ఒకటి లైన్ లో ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: