మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్ “, మెహెర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్ “, బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం లో “చిరంజీవి 154 “మూవీ సెట్స్ పైన ఉన్నాయి. చిరంజీవి ఈ మూడు సినిమాలలో నటించడం విశేషం. ఈ మూవీస్ కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం లో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న”చిరంజీవి 154 “మూవీలో తమిళ నటుడు బాబీ సింహా నెగెటివ్ రోల్ లో నటిస్తున్నట్లు తెలిపారు. బాబీ సింహా మాట్లాడుతూ .. తనది రెగ్యులర్ విలన్ పాత్ర కాదనీ , ఆ క్యారెక్టర్ కోసం ప్రిపేర్ అవ్వాలనీ , మెగాస్టార్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోడానికి ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నాననీ , చిరు నటించిన “ఛాలెంజ్”, “ముగ్గురు మొనగాళ్ళు”, “విజేత”, “స్టేట్ రౌడీ”వంటి సినిమాలు కూడా చూశాననీ , చిరంజీవి గొప్ప నటుడనీ , స్టైలిష్ అండ్ కమర్షియాలిటీ కలబోసిన యాక్టర్ అనీ , డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా చేస్తారనీ చెప్పారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























