క్లాస్, మాస్, ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్స్ ఇలా ఏ జోనర్ లో అయినా నటించగలిగిన టాలీవుడ్ యంగ్ హీరో నటుడు శర్వానంద్. ఇటీవలే మహా సముద్రం లాంటి మాస్ యాక్షన్ సినిమాతో అలరించిన శర్వా.. ఇప్పుడు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్, రష్మికా మందన్న జంటగా నటించిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. ఈసినిమా ఈనెల 25న రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇక మరోవైపు రిలీజ్ కు ఇంకా పది రోజులు కూడా లేదు. అయితే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలోనే ఉంది. ఇక దీనిలో భాగంగానే శర్వా తాజాగా తన డబ్బింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ విషయాన్ని శర్వా తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Completed dubbing for #AadavalluMeekuJohaarlu ❤️
See you all on 25th 💖@iamRashmika @SLVCinemasOffl pic.twitter.com/vUrsAjDUpA
— Sharwanand (@ImSharwanand) February 16, 2022
ఇంకా ఈసినిమాలో సీనియర్ రాధిక, ఖుష్బూ, ఊర్వశి కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వెన్నెల కిశోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోపరాజు, బెనర్జీ, కల్యాణీ, నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్యకృష్ణ, ఆర్‌సీఎమ్ రాజు తదితరులు నటిస్తున్నారు. జాతీయ అవార్డులు సాధించిన శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకు సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మరి శర్వానంద్ కు కూడా సరైన హిట్ పడి చాలా రోజులే అవుతుంది. వరుసగా ఫ్లాప్స్ నే సొంతం చేసుకుంటున్నాడు. ఇక ఫిబ్రవరి 25న గని, భీమ్లానాయక్ లాంటి సినిమాలు పోటీగా ఉన్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో ఈసినిమా ఎలాంటి విజయాన్ని దక్కించుకుంటుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: