‘సెకండ్ హ్యాండ్’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమైనా కూడా ‘నేను శైలజ’ చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు కిషోర్ తిరుమల. ఇప్పటి వరకూ తెలుగులో ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘చిత్రలహరి’, ‘రెడ్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించగా. ఇప్పుడు ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ అనే సినిమాతో వస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ఈనెల 25వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ అయ్యారు మేకర్స్. ఈ నేపథ్యంలో కిషోర్ తిరుమల మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తన తరువాత సినిమా యంగ్ హీరో నాగచైతన్య తో ఉండే అవకాశం ఉందని తెలిపారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈసినిమాను డీవీవీ దానయ్య నిర్మించబోతున్నారని కూడా తెలిపాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.
కాగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. మరి మంచి హిట్ కోసం చూస్తున్న శర్వాకు.. అలానే మంచి హిట్స్ తో దూసుకుపోతున్న రష్మిక మందన్నకు ఈసినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: