‘పుష్ప.. ది రూల్’ కు పెరుగుతున్న డిమాండ్

Pushpa The Rule Craze Increasing Day By Day,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Movie Updates,Pushpa Movie Craze,Pushpa The Rise Craze,Pushpa The Rule,Allu Arjun Pushpa Movie,Icon Star Allu Arjun Movie Pushpa, Allu Arjun Pan India Star,Icon Star Allu Arjun Blockbuster Movie Pushpa the Rise,Pushpa Movie in North,Pushpa the Rule part 2,Pushpa the Rise part 1,DSP Pushpa the Rise, DSP Music Director Movie Pushpa The Rise,Pushpa The Rise Movie,Allu Arjun Movie Pushpa the Rise Music Director DSP,Rashmika Upcoming Movie,Rashmika Latest Movie, Rashmika Movie In 2022,Rashmika in Pushpa The Rise Movie,Bhanwar Singh Shekhawat and Allu Arjun in Part 2 Movie,Sukumars Movie Pushpa The Rise Part1, Director Sukumar Upcoming Movie Pushpa The Rise,Sukumar Pushpa the Rule part 2,#pushpatherule,#alluarjun,#sukumar

పుష్ప ముందు వరకూ స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ పేరును పుష్ప సినిమా చేస్తున్నప్పుడే సుకుమార్ ఐకాన్ స్టార్ అని మార్చేశారు. ఇక పుష్ప రిలీజ్ అయి ఇప్పుడు ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం చూస్తుంటే సుకుమార్ అందుకే అంత ధైర్యంగా ఐకాన్ స్టార్ అని మార్చాడేమో అని అనిపిస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని పాన్ ఇండియా స్టార్‌గా మార్చిన మూవీ ‘పుష్ప ది రైజ్’. పాన్ ఇండియా మూవీగా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. గ‌త ఏడాది విడుద‌లైన చిత్రాల‌న్నింటిలో రూ.300 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించిన చిత్రంగా ‘పుష్ప ది రైజ్’ చిత్రం నిలిచింది. సౌత్ లో హిట్ అవ్వడం ఒక లెక్కయితే.. నార్త్ లో సూపర్ రెస్పాన్స్ రావడం అనేది మరోలెక్క. నార్త్ ఆడియన్స్ మాత్రమే బాలీవుడ్ నటులు కూడా పుష్ప కు ఫిదా అయిపోతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఫస్ట్ పార్ట్ తో అంత క్రేజ్ తెచ్చుకున్న సుకుమార్ కు అసలు టెన్షన్ ఇప్పుడు మొదలవుతుంది. ఫస్ట్ పార్ట్ ఆ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకుంది కాబట్టి సెకండ్ పార్ట్ ఖచ్చితంగా అంతకు మించి ఉండాలి. ప్రస్తుతం అయితే సుకుమార్ ఈ సీక్వెల్ పనిలో పడ్డాడు. ఇక మరోవైపు పుష్ప.. ది రూల్ కు కూడా ఆయన అభిమానులు, సినీ లవర్స్ నుండి కూడా డిమాండ్ పెరుగుతుంది. పుష్ప.. ది రూల్ కు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు పుష్ప.. ది రూల్ కోసం వెయిట్ చేస్తున్నట్టు హ్యాష్ ట్యాగ్ లు కూడా ట్రెండ్ చేస్తున్నారు. పుష్ప.. ది రైజ్ అయిపోయింది.. ఇప్పుడు పుష్ప.. ది రూల్ తో బాక్సాఫీస్ ను రూల్ చేయడానికి వచ్చేస్తున్నాడు అంటూ.. ఇండియన్ సినిమాను బన్నీ రూల్ చేయడం చూడటానికి ఆగలేకపోతున్నాం అంటూ ఇలా పలువురు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ లు పెడుతున్నారు. మరి పుష్ప.. ది రూల్ బాక్సాఫీస్ వద్ద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి.

కాగా ఫస్ట్ పార్ట్ లో ఎర్ర చందనం కూలిగా వచ్చిన పుష్పరాజ్.. తన తెలివితో, ధైర్యంతో సిండికేట్‌కు ఎలా బాస్‌గా ఎదిగాడ‌నేదే చూపించారు. ఇక సెకండ్ పార్ట్‌గా రానున్న ‘పుష్ప ది రూల్’ చిత్రంలో ఐపీఎస్ ఆఫీస‌ర్ భన్వర్ సింగ్ షెకావ‌త్‌కి, పుష్పరాజ్‌కి మ‌ధ్య వ‌చ్చిన ఇగో గొడ‌వ‌లు ఎంత వ‌ర‌కు వెళ్లాయి. దాని వ‌ల్ల ఎవ‌రికి ఏమైంద‌నేది చూపించ‌బోతున్నారు. మరి సుకుమార్ పార్ట్ 2 ను ఎలా తీస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూద్దాం అది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =