మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో హీరో నాని కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ పేరుతో నటిస్తున్నారు.ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కనున్న “దసరా “మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో “అంటే .. సుందరానికీ! “మూవీ లో ఒక సాంగ్ తెరకెక్కుతుంది. ఈ సాంగ్ ను ట్రెండీ లుక్ లో నాని మరియు నజ్రియాతో శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశారు. హీరో నాని ఎల్లో లుంగీ కట్టుకుని నల్ల షర్ట్ ధరించి డిఫరెంట్ స్టైల్ లో కనిపిస్తున్నారు.నజ్రియా లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. నాని మరియు నజ్రియాలు కలిసి వేసే స్టెప్పులతో ఈ సాంగ్ ఈ మూవీ కి ప్రధాన ఆకర్షణగా ఉండే అవకాశం ఉంది. సూపర్ హిట్ “శ్యామ్ సింగ రాయ్ ” మూవీతో ప్రేక్షకులను అలరించిన హీరో నాని “అంటే .. సుందరానికీ! ” మూవీ తో అలరించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: