రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇప్పటికే విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఛాలెంజ్ లో పాల్గొన్ని ఎన్నో మొక్కలను నాటారు. ఇక దీనిలో భాగంగానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాజిపల్లిలో 1,650 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే కదా. తన తండ్రి పేరిట ప్రభాస్ దానిని అభివృద్ధి చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో అగ్రహీరో కూడా ముందుకొచ్చారు. ఆ అగ్రహీరో ఎవరో కాదు కింగ్ నాగార్జున.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాగార్జున ఇప్పటికే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే అదే సమయంలో తాను ఓ అడవిని దత్తత తీసుకునేందుకు ముందుకొస్తానని సంతోష్ కుమార్ కు మాట ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నారు నాగార్జున. నేడు 1,080 ఎకరాల అడవిని దత్తత తీసుకున్నారు. అంతేకాదు ఆ ప్రాంతానికి అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ పార్క్ అనే పేరు పెట్టి.. శిలా ఫలకాన్ని ఆవిష్కరించి.. మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సంతోష్ కుమార్, నాగార్జున, అమల, నాగ సుశీల, నాగచైతన్య, అఖిల్ తో పాటు మేనల్లుడు సుశాంత్ ఇంకా అక్కినేని కుటుంబసభ్యులు అందరూ పాల్గొన్నారు. ఇక ఈసందర్భంగా నాగార్జున తన ట్విట్టర్ లో తమకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Many happy returns of the day to chief minister Kcr garu!
Happy to announce the adoption and laying the foundation for the ANR URBAN PARK in chengicherla forest area by the Akkineni family
🙏 to #kcr garu and @MPsantoshtrs for this opportunity #greenindiachallenge #HBDKCR pic.twitter.com/HcGZIiKm5k
— Nagarjuna Akkineni (@iamnagarjuna) February 17, 2022
ఇక ఇటీవలే బంగార్రాజు సినిమాతో మంచి హిట్ ను కొట్టారు నాగార్జున. ఇక ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో చేసిన బ్రహ్మాస్త్ర సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇంకా ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ కు కరోనా వల్ల బ్రేక్ రాగా రీసెంట్ గానే మళ్లీ రీస్టార్ట్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది ఈసినిమా.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: