
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 186


ఆది సాయి కుమార్ కు జోడీగా దిగాంగన

'క్లాప్'.. కొత్త అనుభూతినిచ్చే సినిమా..!

"ది ఘోస్ట్"మూవీ అప్ డేట్

ఐమాక్స్ వెర్షన్ లో "రౌద్రం రణం రుధిరం"మూవీ

"పుష్ప " మూవీ క్రేజ్ "తగ్గేదేలే"

'వలిమై' డైరెక్టతో మరో సినిమా లాంచ్..!

కర్నూలు లో "అఖండ " శతదినోత్సవం

ఫెయిల్యూర్ భయమే అలా చేస్తుంది...!

'దూత'.. ఫీమేల్ లీడ్స్ తో చైతు..!

బాలీవుడ్ లో బిజీగా తమన్నా
"చాంద్ సా రోషన్ చెహరా " (2005 )మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన మిల్కీ బ్యూటీ తమన్నా “శ్రీ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్రస్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, వెంకటేష్ “F 3”, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. వరుణ్ తేజ్ “గని”మూవీ లో తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు.

ఆది సాయి కుమార్ కు జోడీగా దిగాంగన
యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా “కిరాతక “, “జంగిల్ “, “తీస్ మార్ ఖాన్”, “అమరన్”, ”బ్లాక్ “, “అతిథి దేవోభవ ” , "CSI సనాతన్" మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి. ఆది ప్రస్తుతం మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ లో నటిస్తున్నారు. కె.కె.రాధామోహన్ నిర్మాతగా సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా ”ప్రొడక్షన్ నెం 10 ” మూవీ తెరకెక్కుతుంది. ధృవన్ సంగీతం అందిస్తున్నారు.

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో రష్మిక అరబిక్ కుతు సాంగ్ కు డ్యాన్స్
సన్ పిక్చర్స్ బ్యానర్ పై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ , పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన “బీస్ట్ “మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అరబిక్ కుతు ” సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. స్టార్ హీరో విజయ్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన “అరబిక్ కుతు ” సాంగ్ కు స్టార్ హీరోయిన్స్ సమంత , కీర్తి సురేష్ లు అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసి ఆ వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారాయి. ఈ సాంగ్ రిలీజైన 23 రోజుల్లోనే 150 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసింది.

'జాతి రత్నాలు' కి ఒక ఏడాది.. థ్యాంక్స్ చెబుతున్ననవీన్..!
అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా జాతి రత్నాలు. కామెడీ అండ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో చూశాం. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. దీంతో చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. నిజానికి ఈసినిమా రిలీజ్ సమయంలో కరోనా ప్రభావం కూడా కాస్త ఎక్కువగానే ఉంది. థియేటర్లు కూడా అప్పుడప్పుడే తెరిచిన సందర్భాలు.. ప్రేక్షకులు కూడా బయటకు రావడానికి భయపడుతున్న రోజులు అయినా కూడా మేకర్స్ ధైర్యంగా ఈసినిమాను రిలీజ్ చేశారు. వారి…

"ఆర్ఆర్ఆర్"నుండి ఎత్తర జెండా సాంగ్ రిలీజ్ డేట్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

'క్లాప్'.. కొత్త అనుభూతినిచ్చే సినిమా..!
యంగ్ హీరో ఆది పినిశెట్టి కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అప్పుడప్పుడు సపోర్టివ్ రోల్స్ చేస్తూనే హీరోగా కూడా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం ఆది పినిశెట్టి పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో చేసిన క్లాప్ సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా అథ్లెటిక్ స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తుంది. ఈసినిమాకు కూడా కరోన వల్ల పలు బ్రేకులు పడగా.. ఫైనల్ గా రిలీజ్ అయింది. ముందు ఈసినిమా థియేటర్లలో రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ లో ఈసినిమా నేడు స్ట్రీమింగ్ అవుతుంది.

ZEE 5 తెలుగు లో "రౌడీ బాయ్స్ "స్ట్రీమింగ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “హుషారు” మూవీ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన యూత్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ “రౌడీ బాయ్స్” మూవీ జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.ఆశిష్ పెర్ఫార్మెన్స్ అండ్ డ్యాన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి.ఆశిష్ డైలాగ్ మాడ్యులేషన్, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. అనుపమ పరమేశ్వరన్ ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఆశిష్ – అనుపమ మధ్య…

"బీస్ట్"తమిళ మూవీ అరబిక్ కుతు సాంగ్ రికార్డ్
సన్ పిక్చర్స్ బ్యానర్ పై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ , పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన “బీస్ట్ “మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అరబిక్ కుతు ” సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. స్టార్ హీరో విజయ్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన “అరబిక్ కుతు ” సాంగ్ కు స్టార్ హీరోయిన్స్ సమంత , కీర్తి సురేష్ లు అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసి ఆ వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారాయి.

"సర్కారు వారి పాట "సెకండ్ సింగిల్ పక్కా మాస్ -థమన్ ఎస్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.“సర్కారు వారి పాట” చిత్ర యూనిట్ ప్రేమికుల రోజు సందర్భంగా “కళావతి” లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది.

"ది ఘోస్ట్"మూవీ అప్ డేట్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున, సోనాల్ చౌహాన్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ "ది ఘోస్ట్"మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భరత్ శౌరబ్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఐమాక్స్ వెర్షన్ లో "రౌద్రం రణం రుధిరం"మూవీ
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

"రాధే శ్యామ్" మూవీకి వాయిస్ అందించిన స్టార్స్ కు ప్రభాస్ థ్యాంక్స్
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు…

'చిరు' స్పూర్తితో చిరుతను పెంచుకుంటున్న డాక్టర్.. వాటికోసం ఉక్రెయిన్ లోనే..!
గత కొద్దిరోజులుగా రష్యా-ఉక్రెయిన్ దేశాలమధ్య భీకరయుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్దంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక అక్కడ భారతీయులు కూడా ఎంతో మంది జీవనం సాగిస్తుండగా.. ఇప్పటికే వేలాది మందిని కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకొస్తోంది. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. అక్కడ ఉన్న ఓ తెలుగు యువకుడు మాత్రం ఇక్కడికి వచ్చేది లేదు అంటున్నాడు. దానికి కారణం తను పెంచుకుంటున్న చిరుతి, జాగ్వర్ లే కారణం.

"పుష్ప " మూవీ క్రేజ్ "తగ్గేదేలే"
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప ” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషల తో పాటు ఓవర్ సీస్ లో రిలీజ్ అయ్య సుమారు 360 కోట్లు కు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్…

'వలిమై' డైరెక్టతో మరో సినిమా లాంచ్..!
తమళ్ స్టార్ హీరో అజిత్ మాత్రం తన స్పీడును ఎక్కడా తగ్గించట్లేదు. రీసెంట్ గానే భారీ అంచనాల మధ్య వచ్చిన వలిమై సినిమా ఆ అంచనాలను అంతలా రీచ్ కాలేకపోయింది. అయితే అజిత్ మాత్రం జయాపజయాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఆ సినిమా రిలీజ్ అయిందో లేదో ఇప్పుడు వెంటనే మరో సినిమాను కూడా స్టార్ట్ చేసేశారు. అయితే ఈసారి కూడా మళ్లీ హెచ్. వినోద్ తోనే సినిమా చేయడం గమనార్హం. అజిత్ కు ఇదేమీ కొత్తకాదు. గతంలో తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో వరుసగా నాలుగు సినిమాలు చేశాడు. నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్లుగా నిలిచాయి.

కర్నూలు లో "అఖండ " శతదినోత్సవం
హీరో నందమూరి బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

'లాలా' పుట్టినరోజు.. మిగిలింది హిస్టరీ
సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ మల్టీస్టారర్ భీమ్లానాయక్. ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు కదా. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా సాలిడ్ కలెక్షన్స్ కొల్లగొడుతూ దూసుకుపోతుంది. ఇక ఈసినిమా పాటలు ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విజయంలో పాటలు కూడా కీలక పాత్ర పోషించాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పాటలు రిలీజ్ చేసిన దగ్గర నుండి రికార్డు స్థాయిలో మారు మ్రోగుతూనే ఉన్నాయి.

ఫెయిల్యూర్ భయమే అలా చేస్తుంది...!
దర్శకధీరుడు రాజమౌళి గురించి మేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇప్పటివరకూ విజయం తప్పా పరాజయం ఎరుగని డైరెక్టర్. అంతేకాదు సినిమా సినిమాకు తన టేకింగ్ లో కొత్త దనం చూపిస్తూ వస్తూనే ఉన్నాడు. అందుకే బాహుబలి లాంటి సినిమాను తీసి తెలుగు సినిమా స్థాయిని పెంచాడు. రాజమౌళి నుండి సినిమా వస్తుందంటే అది తప్పకుండా రికార్డలు చేస్తుంది అనే నమ్మకం ఉండటమే కాదు.. చాలామందికి రాజమౌళి సినిమాలో నటించాలన్న కోరక కూడా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇంతవరకూ ఫెయిల్యూర్ అంటేనే తెలియని రాజమౌళికి కూడా ఫెయిల్యూర్ భయం ఉంటుంది అంటున్నాడు.

'దూత'.. ఫీమేల్ లీడ్స్ తో చైతు..!
యంగ్ హీరో నాగచైతన్య వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లోనే ఉన్నాడు. గత ఏడాది లవ్ స్టోరీతో హిట్ కొట్టిన నాగ చైతన్య రీసెంట్ గా బంగార్రాజు సినిమాతో మరో హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు తన తరువాత ప్రాజెక్ట్ ను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య థ్యాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తుండగా.. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

రష్మిక బాలీవుడ్ స్ట్రయిట్ మూవీ "మిషన్ మజ్ను "రిలీజ్ డేట్
కన్నడ , తెలుగు చిత్ర పరిశ్రమలలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక " సుల్తాన్ "మూవీ తో తమిళ ప్రేక్షకులను అలరించారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రష్మిక "మిషన్ మజ్ను ", "గుడ్ బై " బాలీవుడ్ మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక బాలీవుడ్ ఫస్ట్ స్ట్రయిట్ మూవీ "మిషన్ మజ్ను "రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యింది.