‘క్లాప్’.. కొత్త అనుభూతినిచ్చే సినిమా..!

Aadhi Pinisetty about Clap Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Aadi Pinisettys,Hero Aadi Pinisettys,Aadi Pinisettys Movie Updates,Aadi Pinisettys latst Movie updates,Aadi Pinisettys Clap Movie,Aadi Pinisettys Clam Movie Trailer Out, Aadhi Pinisetty Say Clap is a Good Feel Movie,Aadhi Pinisetty Talks About Clap Movie,Aadhi Pinisetty Comments on Clap Movie,Aadhi Pinisetty Interesting Comments on Clap Movie,Director Prithivi Adithya For Clap Movie,Clap Movie Director Prithivi Adithya,Prithivi Adithya upcoming Movies,Prithivi Adithya latest Updates, Aadhi Pinisetty about Clap Movie,Aadi Pinisettys pcoming Movie Clap Movie Trailer Out,Aadi Pinisettys Telugu Movies,Aadi Pinisettys Ucoming Movie Clap,Aadi Pinisettys New Movie Clap Trailer Out, Aadi Pinisettys Clap Movie Trailer Released,Aakanksha Singh,Aakanksha Singh Upcoming Movies,Aakanksha Singh Telugu movies,Aakanksha Singh wth Aadi Pinisettys Movie Clap, Aadi Pinisettys Movie Clap On OTT,Aadi Pinisettys Movie Clap on Sonyliv,ilaiyaraaja Music Composer,ilaiyaraaja Music Director For Clap,Clap Movie On Sonyliv,Clap Movie in OTT Sonyliv From Marach 11th, Clap movie Release in OTT From March 11th,Clap Streaming On Sonyliv From March 11th,#ClapOnSonyLIV,@AadhiOfficial,#ilaiyaraaja,#aakanksha_s30,#prithivifilmist

యంగ్ హీరో ఆది పినిశెట్టి కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అప్పుడప్పుడు సపోర్టివ్ రోల్స్ చేస్తూనే హీరోగా కూడా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం ఆది పినిశెట్టి పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో చేసిన క్లాప్ సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా అథ్లెటిక్ స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తుంది. ఈసినిమాకు కూడా కరోన వల్ల పలు బ్రేకులు పడగా.. ఫైనల్ గా రిలీజ్ అయింది. ముందు ఈసినిమా థియేటర్లలో రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ లో ఈసినిమా నేడు స్ట్రీమింగ్ అవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసందర్భంగా తాజాగా ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలో ఈసినిమా గురించి ఆది మాట్లాడుతూ.. ఈసినిమాలో కామెడీ, డాన్స్‌, ఫైట్స్‌ లాంటి ఎలిమెంట్స్ ఏం లేవు.. కానీ ప్రేక్షకులను ఆకట్టుకునే పలు అంశాలు ఉన్నాయి. సినిమాటిక్‌ డ్రామా లేకుండా దర్శకుడు నిజాయితీగా కథను తెరకెక్కించాడు. క్లాప్‌ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది అని తెలియచేశాడు. ఇక నిర్మాతలు రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ..ఆది కథలను ఎంపిక చేసుకునే విధానంపై మాకు నమ్మకం ఉంది.. అందుకే ఈ చిత్రాన్ని నిర్మించాం.. క్రీడా నేపథ్యంలో ఇప్పటిదాకా ఇలాంటి సినిమా రాలేదు’ అన్నారు.

ఆది పినిశెట్టి సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికగా న‌టిస్తుండగా..ఇంకా ఈ సినిమాలో కృష్ణ కురూప్ , ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మాజీ, రాందాసు తదితరులు నటిస్తున్నారు. ఐబీ కార్తికేయన్ సమర్పణలో శ్రీ షిరిడీసాయి మూవీస్‌, బిగ్ ప్రింట్ పిక్చర్స్, సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లపై రామాంజ‌నేయులు జ‌వ్వాజి, యం .రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.