శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున, సోనాల్ చౌహాన్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “ది ఘోస్ట్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భరత్ శౌరబ్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా థర్డ్ వేవ్ కారణంగా చాలా రోజులుగా షూటింగ్ పరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ బుధవారం దుబాయ్ లో మొదలైంది.దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఆన్ లొకేషన్ కు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. హీరో నాగార్జున, హీరోయిన్ సొనాల్ చౌహాన్ లు పాల్గొనగా బోట్ లో దర్శకుడు ప్రవీణ్ సత్తారు కొన్ని సన్నివేశాలని చిత్రీకరించారు.దుబాయ్ లో పలు కీలక సన్నివేశాలని చిత్రీకరించిన అనంతరకం చిత్ర బృందం తిరిగి హైదరాబాద్ చేరుకోనుందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: